Home

»

Latest News

వర్మతో శాతకర్ణి..!

Oct 20, 2016 11:06AM

రామ్‌గోపాల్ వర్మ, బాలకృష్ణ ఇద్దరూ రెండు భిన్న ధృవాలు. 90వ దశకంలో వర్మ ప్రభ బాగా వెలుగుతున్న సమయంలో ఆయనతో సినిమాలు చేయడానికి ఆనాటి అగ్రకథానాయకులు పోటి పడ్డారు. ఆ సందర్భంలో బాలకృష్ణ కూడా వర్మతో సినిమా చేస్తాడని అందరూ భావించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. అయితే గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఆ పక్కనే అమితాబ్ సర్కార్-3 షూటింగ్ కూడా జరుగుతుండటంతో ఆ లోకేషన్‌కు వెళ్లిన బాలయ్య బిగ్‌బిని కలిసి ముచ్చటించారు. ఆ వెంటనే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతోనూ భేటీ అయ్యారు. ఇపుడు ఈ వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వర్మ దర్శకత్వంలో బాలకృష్ణ నటించనున్నాడని ఆ సినిమాలో బిగ్‌బి కూడా కీలకపాత్ర పోషించనున్నాడని అందుకే ఈ భేటీ జరిగిందని సినీజనాలు చెవులు కొరుక్కుంటున్నారు. మరి సంచలనాలకు మారుపేరైన వర్మ ఈ మీటింగ్‌ సారాంశాన్ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com