![]() |
![]() |

అమ్మాయిలు జీన్స్, టీషర్టులు వేసుకొంటే క్లాస్ పీకే తల్లితండ్రులను ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చూసే ఉంటారు. ఫర్ ఏ చేంజ్... బికినీ వేసుకోమని ఎంకరేజ్ చేసిన తల్లిని, ఎటువంటి రంగు బికినీలు కొనుక్కోవాలో చెప్పిన తండ్రిని ఎక్కడైనా చూశారా? విన్నారా? ఒకవేళ మీరు చూడకపోతే, వినకపోతే రకుల్ బికినీ కథ చదవండి మరి!
రకుల్ మిస్ ఇండియా పోటీలకు వెళ్లకముందు సంగతి ఇది! ఆమె తల్లి రిని రింగ్ పోటీలకు వెళ్లమని ఇంట్లో చెబుతుంటే "అమ్మా... మిస్ ఇండియా పోటీల్లో బికినీ వేసుకోవాలి. అందుకు నేను రెడీగా లేను" అని రకుల్ చెప్పేసింది. అప్పుడు తల్లి రిప్లై ఏంటో తెలుసా? "అందులో ఏముంది? బికినీ వేసుకోవడానికి ఇప్పుడు రెడీ అవ్వు" అని. ఇక, రకుల్ తండ్రి అయితే డల్ కలర్ బికినీలు కొనవద్దన్నీ, బ్రైట్ కలర్స్ కొనమని సలహాలు ఇచ్చారట. ఈ విషయాలను రీసెంట్ ఇంటర్వ్యూలో రకుల్, ఆమె తల్లిచెప్పుకొచ్చారు. ఇప్పటికీ రకుల్ వేసుకొన్న డ్రస్ కలర్ బాలేకపోతే ఆమె తండ్రి నిర్మొహమాటంగా చెబుతారట. చాలామంది అమ్మాయిలకు పేరెంట్స్ నుండి సపోర్ట్ లభించదని, ఆ విషయంలో తాను చాలా లక్కీ అని రకుల్ అన్నారు. అబ్బాయిలతో మాట్లాడే విషయంలోనూ తనకు అమ్మ నుండి సలహాలు వస్తాయని ఆమె చెప్పారు.
![]() |
![]() |