![]() |
![]() |

సూపర్‌స్టార్ రజనీకాంత్ తన పొలిటికల్ పార్టీ విషయంలో అన్ని వదంతులకూ చెక్ పెట్టనున్నారు. తన పార్టీని ఆయన ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి డిసెంబర్ 31వ తేదీన లాంఛనంగా ప్రకటన విడుదల చేయబోతున్నారు. జనవరిలో పార్టీ పేరును ఆయన అనౌన్స్ చేస్తారు. 2021 వేసవిలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయనున్నది.
రాజకీయాల్లో చేరాలనే ఆలోచన ఉన్నదని 2017 డిసెంబర్‌లో రజనీకాంత్ వెల్లడించారు. అంటే రాజకీయ పార్టీని ప్రారంభించాలనే నిర్ణయం తీసుకోవడానికి ఆయనకు మూడేళ్ల కాలం పట్టిందన్న మాట. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. "మేం నీతిమంతమైన, పారదర్శకమైన, అవినీతి రహిత ఆధ్యాత్మిక రాజకీయాలను అందిస్తాం" అని ఆయన ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో అద్భుతం జరగనున్నదని ఆయన వ్యాఖ్యానించారు.
.jpg)
![]() |
![]() |