![]() |
![]() |
సింగర్, బిగ్‌బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయింది. దాంతో, అతను ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడనే ఊహాగానాలు కూడా ఎక్కువయ్యాయి. ఈ వార్తలపై రాహుల్ సిప్లిగంజ్ స్పందిస్తూ ‘‘నేను రాజకీయాల్లోకి వస్తున్నానని, గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నానని కొన్ని రోజులుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. నేను కళాకారుణ్ని. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల్ని గౌరవిస్తాను. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే నా పని. జీవితాంతం ఆర్టిస్ట్‌గానే కొనసాగుతాను. సంగీతంలోనే నా కెరీర్ కొనసాగిస్తాను. ఇండస్ట్రీలో నేను చేయాల్సి పని చాలా ఉంది. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుల్ని నేను కలవలేదు. అలాగే నన్ను ఎవరూ కలవలేదు. ఇలాంటి రూమర్స్ ఆపండి’’ అంటూ విజ్ఞప్తి చేశారు రాహుల్ సిప్లిగంజ్.
![]() |
![]() |