![]() |
![]() |
.jpg)
'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా చేసే దాకా తనకు విజయ్ దేవరకొండ థియేటర్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన విషయం తనకు తెలీదనీ, ఆ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టే, అతనితో కలిసి పనిచెయ్యడం తనకు సులువయ్యిందనీ అంటోంది బ్యూటిఫుల్ యాక్ట్రెస్ రాశీ ఖన్నా. అంతేకాదు, టైటిల్‌కు విజయ్ సరిగ్గా మ్యచ్ అవుతాడని కూడా అమె చెబుతోంది. "సినిమా చూశాక 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్ విజయ్ దేవరకొండకు యాప్ట్ అని అర్థమవుతుంది. తన గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా చేసే ముందు వరకు విజయ్‌కు థియేటర్ బ్యాగ్రౌండ్ ఉందని నాకు తెలీదు. సినిమా చేసేప్పుడు చెప్పాడు, 'నాకు థియేటర్ బ్యాగ్రౌండ్ ఉంది' అని. బహుశా అందువల్లేనేమో అతనితో కలిసి పనిచెయ్యడం చాలా సులువు అనిపించింది. పర్ఫార్మెన్స్ విషయంలో అతను సో గుడ్. అతనితో కలిసి పనిచేయడాన్ని చాలా ఎంజయ్ చేశాను. అతను ఫినామినల్" అని చెప్పింది రాశీ.
ఆ మూవీ ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన ఆమె, ఇందులో విజయ్ కొత్తగా కనిపిస్తాడని కూడా తెలిపింది. "టీజర్ రిలీజైనప్పుడు ఇది 'అర్జున్ రెడ్డి' తరహాలో ఉందని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ ట్రైలర్ వచ్చాక వాళ్ల ఒపీనియన్ మారిందనుకుంటున్నా. సినిమా ఎలా ఉండబోతోందో ట్రైలర్ వల్ల తెలిసిందనుకుంటున్నా. విజయ్ మునుపటి సినిమాలు చూశాను కాబట్టి, ఈ సినిమాలో నేను చేశాను కాబట్టి, ఇప్పటిదాకా తను చెయ్యని పాత్రను విజయ్ 'వరల్డ్ ఫేమస్ లవర్'లో చేశాడని కచ్చితంగా చెప్పగలను. అతని క్యారెక్టర్‌తో చాలామంది రిలేట్ అవుతారు. అతనికే కాదు, మా అందరికీ ఇది కొత్త థీమ్" అంటోంది రాశీ. ఆమె ఈ సినిమాలో యామిని అనే పాత్రలో కనిపించనున్నది.
![]() |
![]() |