![]() |
![]() |

వారం క్రితం తాను కొవిడ్-19 పాజిటివ్‌గా టెస్టుల్లో నిర్ధారణ అయ్యిందనే విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేశాడు మలయాళం స్టార్ యాక్టర్, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్. 'జన గణ మన' మూవీ షూటింగ్‌ను పునఃప్రారంభించిన ఆయనకు యూనిట్ మెంబర్స్‌తో పాటు చేసిన టెస్ట్‌లో కరోనా వైరస్ సోకినట్లు వెల్లడైంది. అప్పట్నుంచీ ఐసొలేషన్‌లో ఉన్న ఆయనకు వారం తర్వాత యాంటీజెన్ టెస్ట్‌లో నెగటివ్ అని వచ్చింది. అయినప్పటికీ, మరో వారం రోజుల పాటు ఐసోలేషన్‌లోనే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నాడు.
ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పృథ్వీరాజ్ తన మెడికల్ రిపోర్ట్‌ను షేర్ చేసుకున్నాడు. "యాంటీజెన్ టెస్ట్‌లో ఈరోజు నెగటివ్ అని వచ్చింది. రెట్టింపు కచ్చితత్వం కోసం మరో వారం రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉంటాను. నా ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపించిన, ఆందోళన వ్యక్తం చేసిన, ఇక్కడకు వచ్చిన అందరికీ మరోసారి నా ధన్యవాదాలు" అని రాసుకొచ్చాడు. ఇదివరకు భారత్‌లో లాక్‌డౌన్ ప్రకటించే సమయానికి 'ఆడుజీవితమ్' షూటింగ్ నిమిత్తం జోర్డాన్ వెళ్లిన పృథ్వీరాజ్ అక్కడ చిక్కుకుపోయాడు.

![]() |
![]() |