Home

»

Latest News

తలిదండ్రులైన ప్రభాస్‌, అనుష్క... ఇది నిజమేనా?

Oct 7, 2023 2:30PM

ప్రభాస్‌, అనుష్క జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్క్రీన్‌మీద వారిద్దరి ప్రజెన్స్‌ చాలా అద్భుతంగా ఉంటుంది. వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్‌. ఈ సినిమాల్లో ఈ జంటను చూసి అందరూ మురిసిపోయారు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నారు. అయితే ప్రేక్షకులు, అభిమానులు అలా అనుకోవడం వెనుక కారణం ఉంది. అదేమిటంటే.. వారిద్దరి మధ్య ప్రేమాయణం జరుగుతోందని, ఇద్దరూ పెళ్ళి చేసుకునే ఆలోచనలో ఉన్నారన్న వార్తలు అప్పట్లో వైరల్‌ అయ్యాయి. ఈ వార్తల నేపథ్యంలో అనుష్క మాట్లాడుతూ.. ప్రభాస్‌ మంచి స్నేహితుడు మాత్రమేనని, తమ మధ్య ఎలాంటి రిలేషన్‌ లేదని తేల్చి చెప్పింది. అప్పటి నుంచి వీరిద్దరి గురించి వార్తలు బాగా తగ్గాయి. అయితే ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ వార్తల్లోకి వచ్చారు. అదెలాగంటే...

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనే టెక్నాలజీ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది.  ఈ టెక్నాలజీ ద్వారా ఫోటోలను ఎడిట్‌ చేయడం చాలా ఈజీ అయిపోయింది. దాంతో తమ అభిమాన తారలను తమకు నచ్చిన విధంగా ఎడిట్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. ఒరిజినల్‌ ఫోటోలకు ఏమాత్రం తీసిపోకుండా అద్భుతంగా ఈ ఫోటోలు వస్తున్నాయి. టాలీవుడ్‌లోని టాప్‌ స్టార్స్‌ అందరి ఫోటోలు ఈ టెక్నాలజీలో ఎడిట్‌ చేస్తున్నారు. అయితే ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాత్రం కాస్త అడ్వాన్స్‌ అయ్యారు. ప్రభాస్‌కి, అనుష్కకి పెళ్ళి చేసి, ఒక పాపకు తలిదండ్రుల్ని కూడా చేసేశారు. ఇది ప్రభాస్‌ కుటుంబం.. అంటూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ ఎడిట్‌ చేసి కొన్ని ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రభాస్‌కు, అనుష్కకు పెళ్లి జరిగినట్లు ఓ పాపకు జన్మనిచ్చినట్లు ఫోటోలను ఎడిట్‌ చేశారు. ఈ ఫోటోలను చూసి ప్రభాస్‌, అనుష్క పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని తాము కోరుకుంటున్నామని ప్రభాస్‌ అభిమానులు పోస్టులు పెట్టి ఆనందిస్తున్నారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com