![]() |
![]() |

టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ బుట్టబొమ్మ పూజా హెగ్డే షూటింగ్ లో గాయపడింది. దీంతో కొద్దిరోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి, రెస్ట్ తీసుకుంటోంది.
తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన 'SSMB 28', హిందీలో సల్మాన్ ఖాన్ సరసన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాలలో పూజా హెగ్డే నటిస్తోంది. అయితే తాజాగా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' షూటింగ్ సమయంలో ఆమె ఎడమ కాలి పాదానికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో వైద్యులు ఆమెకి రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. పూజా హెగ్డే సైతం సోషల్ మీడియాలో గాయమైన తన కాలి ఫోటోని పంచుకుంది.
ఇదిలా ఉంటే రణ్ వీర్ సింగ్ సరసన పూజా హెగ్డే నటించిన 'సర్కస్' సినిమా డిసెంబర్ 23న విడుదల కానుంది. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకుడు.
![]() |
![]() |