![]() |
![]() |
.webp)
గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)అప్ కమింగ్ మూవీ 'పెద్ది'(Peddi). స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి చరణ్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాయి. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు(Buchibabu)దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ తో పాటు డైలాగ్స్ 'పెద్ది' పై ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోను పాజిటివ్ వైబ్రేషన్స్ ని కలిగిస్తున్నాయి.
పెద్దిలో కన్నడ సూపర్ స్టార్ 'శివరాజ్ కుమార్'(Shiva rajkumar)ఒక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన బర్త్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేకర్స్ బర్త్ డే విషెస్ చెప్తు 'పెద్ది' లో శివరాజ్ కుమార్ క్యారక్టర్ కి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఒక సైడ్ నుంచి రిలీజ్ చేసిన పిక్ లో శివరాజ్ కుమార్ గెటప్ విలేజెస్ లో పాత తరం మనుషుల స్టైల్ లో ఉంది. తనలోని కోపాన్ని దాచుకొని, ఏదో విషయంపై ఆలోచిస్తున్నట్టుగా ఉండటంతో పాటు, ఇష్టం లేని నవ్వుని బయటకి చూపిస్తునట్టుగా ఉండటంతో పెద్దిలో అయన క్యారక్టర్ పై ఆసక్తి నెలకొని ఉంది. 'గౌర్ నాయుడు' గా కనిపించబోతున్నాడు.
చరణ్ సరసన 'దేవర' ఫేమ్ 'జాన్వీ కపూర్' జత కడుతుండగా స్టార్ యాక్టర్ జగపతి బాబు, దివ్యేన్దు శర్మ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఏ ఆర్ రెహ్మాన్(Ar Rahman)సంగీత దర్శకుడు. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27 వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న పెద్దిలో పలు రకాల క్రీడల్లో ప్రావిణ్యం ఉన్న ఆటగాడిగా చరణ్ తన సత్తా చాటనున్నాడు.

![]() |
![]() |