![]() |
![]() |

రాజకీయాల్లో పూర్తి స్థాయి దృష్టి పెట్టాలన్న ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ తాత్కాలికంగా సినిమాలకి విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. 2019 ఎలక్షన్స్ తర్వాత వచ్చే పరిణామాల పైన పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ ఆధారపడి ఉంది. ఒకవేళ, పొలిటికల్ గా బిజీ గా ఉన్నట్టయితే, మరికొంత సమయం తీసుకోవచ్చు. లేదా అనుకోని పరిస్థితులు వస్తే సినిమాల్లోకి తిరిగి రావొచ్చు. అయితే, ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ ని వదిలే ఆలోచనలో ఉన్నట్టు లేదు. ప్రస్తుతం, నితిన్ తో చల్ మోహన్ రంగ అనే సినిమా నిర్మిస్తున్న పవన్, ముందు ముందు మరిన్ని సినిమాల్ని ప్రొడ్యూస్ చేసే ఆలోచనలో ఉన్నాడట. చిన్న తరహా నుండి భారీ తరహా చిత్రాల్ని తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ద్వారా నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నాడట. తనకు సన్నిహితులయిన కొందరితో తాను రామ్ చరణ్ తో తీయబోయే సినిమాకి కథ సిద్ధం చేయమని చెప్పాడట. అన్నీ కుదిరితే, పవన్ కళ్యాణ్ నిర్మాణంలో రామ్ చరణ్ సినిమా వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికి మెగా ఫాన్స్ కి త్వరలో పండగ రోజులు రాబోతున్నాయి. పవన్, చరణ్ కలయిక అంటే మామూలు విషయం కాదు కదా మరి. బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయం!
![]() |
![]() |