Home

»

Latest News

అజిత్‌ను పక్కకునెట్టిన పవన్..

Sep 3, 2016 2:43PM

భారతీయులు సినీ తారలను ఆరాధించినట్టుగా మరే దేశంలోనూ ఉండదు. అభిమాన నటుడి సినిమా రిలీజ్ అవుతున్నా..అతని పుట్టిన రోజు వచ్చినా ఫ్యాన్స్ సందడి మామూలుగా ఉండదు. ఆ రోజంతా అన్నదానాలు, సేవాకార్యక్రమాలతో అభిమాన నటుడి బర్త్‌డే సెలబ్రేషన్స్ అదిరిపోతాయి. ముఖ్యంగా తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ఈ పిచ్చి బాగా ఎక్కువ. ఇష్టమైన స్టార్ పట్ల అప్పట్లో ఫ్లేక్సీలు, బ్యానర్లు, రక్త దానాలతో తమ అభిమానాన్ని వ్యక్త పరచేవారు అభిమానులు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఆన్‌లైన్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిల్లోనూ రికార్డ్స్ సృష్టిస్తున్నారు ఫ్యాన్స్.  ఈ లిస్ట్‌లో ముందు వరుసలో ఉంటారు పవన్ , అజిత్ అభిమానులు. తమిళస్టార్ హీరో అజిత్ పుట్టిన రోజు నాడు ఆయన అభిమానులు చేసిన హ్యాష్ ట్యాగ్‌తో 4.3 లక్షల ట్వీట్స్ వచ్చాయి. ఆ తర్వాత ఎన్నై అరిందాల్ హ్యాష్ ట్యాగ్‌‌కు 5.3 లక్షల ట్వీట్స్ నమోదు చేసుకుని ట్విట్టర్ ఇండియాలో రికార్డు క్రియేట్ చేసింది. అయితే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రికార్డును బద్దలుకొట్టారు. నిన్న ఆయన బర్త్‌డే సందర్భంగా సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా పవన్‌కి విషెస్ చెప్పడంతో ట్వీట్లు, రీట్వీట్లతో ట్విట్టర్ హోరెత్తిపోయింది. హ్యాపీ బర్త్‌ డే పవన్ కళ్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్‌పై ఇప్పటి వరకు 5 లక్షల 50 వేలకు పైగా ట్వీట్స్ వచ్చాయి..ఇది 6 లక్షలు దాటేస్తుందని ట్వీట్టర్ ఇండియా అంచనా వేస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com