Home  »  News  »  పావలా శ్యామల కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా!..ఈ మహానుభావులే పేరు పెట్టింది

Updated : Jul 29, 2026

 

తెలుగు చిత్ర పరిశ్రమతో పావలా శ్యామల(Pavala Shyamala)గారికి ఉన్న అనుబంధం యొక్క వయసు నాలుగు  దశాబ్దాలపైనే. ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ట్రేడ్ మార్క్ కూడా క్రియేట్ చేసుకున్న పావలా శ్యామల జెన్ జి బ్యాచ్ ని సైతం మత్తు వదలరా మూవీతో నవ్వించింది. పావలా శ్యామల'  అసలు పేరు నేతి శ్యామల. 


 1951వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా అమరావతి గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన శ్యామల గారు పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. కేవలం 13 సంవత్సరాల అతిపిన్న వయసులోనే ఆమెకు వివాహం జరిగింది. . కుమార్తె జన్మించిన కొద్ది కాలానికే ఒక భయంకరమైన ప్రమాదంలో భర్త కన్నుమూయడంతో శ్యామల గారి జీవితం ఒక్కసారిగా చీకటిమయమైంది. పిల్లల పెంపకం, జీవనాధారం కోసం ఆమె ధైర్యంగా అడుగు ముందుకు వేసి నటననే తన శ్వాసగా ఎంచుకున్నారు.

ఆమె నటనా ప్రస్థానం మొదట రంగుల వెండితెరపై కాదు, వేదికలపై వెలిగే రంగస్థలం నుంచి ప్రారంభమైంది. 'దొంగాటకం' అనే నాటకంతో నాటక రంగానికి పరిచయమైన శ్యామల గారు తన అద్భుతమైన హావభావాలు, గంభీరమైన సంభాషణలతో నాటక ప్రియులను మంత్రముగ్ధులను చేశారు. ఈ క్రమంలో ప్రముఖ రచయిత గణేష్ పాత్రో రాసిన ‘పావలా’ అనే విప్లవాత్మక నాటకంలో ఆమె పోషించిన క్యారక్టర్  ఒక సంచలనాన్ని సృష్టించింది. ఆ నాటకంలో ఆమె కనబరిచిన జీవాన్ని చూసి ముగ్ధులైన ప్రేక్షకులు మరియు విమర్శకులు ఆమెను ఆప్యాయంగా 'పావలా శ్యామల' అని పిలవడం ప్రారంభించారు. అలా ఒక నాటకం పేరు ఆమె ఇంటి పేరుగా మారి, జీవితాంతం నిలిచిపోవడం చిత్రసీమ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం. రంగస్థలంపై ఉత్తమ నటిగా పలు పురస్కారాలు అందుకున్న పావలా శ్యామల గారు, 1984-85 ప్రాంతంలో జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన 'బాబాయ్ అబ్బాయ్' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. అక్కడ నుంచి ఆమె వెనుతిరిగి చూడలేదు. 'స్వర్ణకమలం', 'కర్తవ్యం', 'బాబాయ్ హోటల్', 'ఇంద్ర', 'ఖడ్గం', 'వర్షం', 'ఆంధ్రావాలా', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'గోలీమార్' నుంచి 'మత్తు వదలరా' వరకు దాదాపు 250కి పైగా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. హాస్యంతో పాటు విలక్షణమైన పల్లెటూరి యాసతో ఆమె చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

Also read: అభిమానులకి వరం ఇచ్చిన అల్లు అర్జున్.. 5 లక్షలు, 3 లక్షలుతో...

అయితే, వందలాది సినిమాల్లో నటించి తరతరాల ప్రేక్షకులకు నవ్వులు పంచిన ఈ మహానటి చివరి రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలు వర్ణనాతీతం. వృద్ధాప్య సమస్యలు, తీవ్రమైన అనారోగ్యం, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఆమెను చుట్టుముట్టాయి. తన కూతురు క్షయ వ్యాధితో ) మంచాన పడటంతో వైద్య ఖర్చుల కోసం తాను సంపాదించుకున్న నంది అవార్డులను, జ్ఞాపికలను సైతం అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఈ కష్టసమయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించగా, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ₹20,000 తక్షణ సాయంతో పాటు నెలకు ₹10,000 పెన్షన్ మంజూరు చేశారు. అలాగే నిర్మాత దిల్ రాజు గారి బృందం, సినీ ప్రముఖులు ఆమె వైద్యానికి ఆసరాగా నిలిచారు. ఎన్నో ఇబ్బందుల నడుమ పోరాటం సాగించిన పావలా శ్యామల గారు, 74 ఏళ్ల వయసులో మొన్న  హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో కన్నుమూశారు. పేరుకే ఆమె మరణించింది.. సినిమాతో ప్రతి తెలుగు వాడి ఇళ్లల్లో నిత్యం తిరుగుతూనే ఉంటుంది.

Pavala Shyamala, Tollywood






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.