![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)నుంచి 'హరిహరవీరమల్లు'(Hari hara veera mallu)తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోయే మూవీ 'ఓజి'(Og). గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ గ్యాంగ్ స్టర్ గా పవర్ ఫుల్ క్యారక్టర్ లో కనపడనున్నాడు. ఆర్ఆర్ ఆర్ ఫేమ్ దానయ్య(Danayya)నిర్మాత కాగా సుజిత్(Sujeeth)దర్శకుడు. పవన్ పొలిటికల్ గా బిజీగా ఉండటంతో షూటింగ్ ఆలస్యమవుతు వస్తుంది. ప్రస్తుతం మూవీ టీం పవన్ డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంది.
ఈ క్రమంలో ఓజి కి వర్క్ చేస్తున్న కెమెరా డిపార్ట్‌మెంట్ సభ్యుడు సోషల్ మీడియా వేదికగా ఓజి పోస్టర్ ని షేర్ చేసాడు. సదరు పోస్టర్ లో షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుందని మెన్షన్ చేసాడు. దీంతో పవన్ అభిమానుల్లో నూతనోత్సాహం వచ్చినట్లయింది. వీలైనంత త్వరగా పవన్ ఓజి ని కంప్లీట్ చేసి తమ ముందుకు తీసుకురావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఓజీ పై పవన్ అభిమానుల్లో మొదటి నుంచి ప్రత్యేమైన క్రేజ్ ఉంది. పవన్ ఎక్కడకి వెళ్ళినా ఓజి అని అరుస్తూనే ఉండటం అందుకు నిదర్శనం.
ప్రియాంక మోహన్(Priyanka MOhan)హీరోయిన్‌గా చేస్తున్న ఓజి లో ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తుండగా అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయ రెడ్డి, అభిమన్యుసింగ్, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్(Thaman)సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, పవన్ డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఓజి ఈ ఏడాది చివర్లోనే థియేటర్స్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

![]() |
![]() |