Home  »  News  »  ఆదుకోవడంలో ఈ ఇద్దరి తర్వాతే ఎవరైనా 

Updated : Jun 15, 2026

 


నందమూరి లయన్స్ బాలకృష్ణ(Balakrishna),ఎన్టీఆర్(Ntr)ఛరిష్మాకి ఉన్నక్రేజ్ ఏ పాటిదో ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇద్దరు కూడా నూనూగు మీసాల వయసులోనే చిత్ర పరిశ్రమలోకి వచ్చి ఇప్పటికి తమ మేర కొన్ని రికార్డులని భద్రంగా ఉంచుకున్నారు. రీసెంట్ గా ఏ ఇద్దరికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ హోదాలో ఉంది.

టాలీవుడ్‌లో ఒక సినిమా విజయం లేదా అపజయం దర్శకుడి తలరాతను ఎలా మారుస్తుందో చెప్పడానికి కొరటాల శివ ప్రయాణమే ఒక పెద్ద ఉదాహరణ. వరుసగా నాలుగు బ్లాక్‌బస్టర్ విజయాలతో తిరుగులేని దర్శకుడిగా దూసుకుపోతున్న సమయంలో 'ఆచార్య' రూపంలో ఆయనకు ఒక ఊహించని పెద్ద షాక్ తగిలింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ వంటి ఇద్దరు టాప్ స్టార్స్ ఉన్నప్పటికీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 40 కోట్ల లోపు షేర్ వసూలు చేసి, దాదాపు 60 శాతానికి పైగా నష్టాలను మిగిల్చింది. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ ప్లాపుల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాతో కొరటాల శివ కెరీర్ ఒక్కసారిగా ప్రమాదంలో పడింది. పరిశ్రమలో ఆయన పని అయిపోయిందంటూ విమర్శలు వచ్చాయి, ఎంతోమంది నిర్మాతలు, హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి వెనకడుగు వేసిన పరిస్థితి కనిపించింది.

అలాంటి అత్యంత క్లిష్టసమయంలో మాన్ ఆఫ్ మాసెస్   ఎన్టీఆర్ కొరటాల శివకి  కొండంత అండగా నిలిచారు. ప్లాపుల్లో ఉన్న దర్శకుడిని నమ్మి ఏకంగా వందల కోట్ల  భారీ బడ్జెట్‌తో 'దేవర: పార్ట్ 1' ని  పట్టాలెక్కించారు. ఎన్టీఆర్ నమ్మకం వృథా కాలేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'దేవర'  బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి, ఏకంగా 500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో 6 మిలియన్ డాలర్ల మార్కుని  దాటి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ ఒక్క విజయంతో కొరటాల శివ మళ్లీ టాలీవుడ్ టాప్ దర్శకుల లీగ్‌లోకి అడుగుపెట్టడమే కాకుండా, తనపై వచ్చిన విమర్శలన్నింటికీ గట్టి సమాధానం ఇచ్చారు.


Also read: Ntr: మళ్ళీ తెరపైకి వార్ 2 ..వాళ్ళకి మాత్రం సరికొత్త సవాలు 

దేవర సక్సెస్ ఇచ్చిన జోష్‌తో కొరటాల శివకి  ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ దక్కింది. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ తన 112 వ చిత్రానికి  కొరటాల శివతో పని చేస్తున్నాడు. ఇప్పుడు కొరటాల శివకి సంబంధించిన ఈ న్యూస్ వైరల్ గా మారడానికి ప్రధాన కారణం ఏ రోజు కొరటాల శివ పుట్టిన రోజు. దేవర పార్ట్ 2 కూడా ఉన్న విషయం తెలిసిందే. గతంలో కూడా పరాజయాలతో ఉన్న దర్శకులతో ఎన్టీఆర్, బాలకృష్ణ వర్క్ చేసిన దాఖలాలు ఉన్నాయి.
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.