![]() |
![]() |

2014లో డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌ను కలుసుకోవడానికి వెళ్లిన తనను అతను లైంగికంగా వేధించాడంటూ రెండు రోజుల క్రితం నటి పాయల్ ఘోష్ ఏబీఎన్ తెలుగు చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అతడు తన ముందు నగ్నంగా తయారై, తనను కూడా అలాగే నగ్నంగా తయారుకమ్మని చెప్పాడని ఆమె ఆరోపించింది. అవి ఆధారరహిత ఆరోపణలని అనురాగ్ కొట్టివేశాడు. అలాగే అతని మాజీ భార్యలతో పాటు పలువురు సెలబ్రిటీలు అతడికి మద్దతుగా నిలిచారు. అతను నిజమైన స్త్రీవాది అనీ, అలాంటి పనులు అతనెన్నడూ చేయలేదనీ వారు అతడిని వెనకేసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో, 2018 నాటి పాయల్ ట్వీట్ ఒకటి తెరపైకి వచ్చి, వైరల్‌గా మారింది. అందులో ఆమె "ఇక్కడెవరూ రేప్ చేయరు" అని చెప్పడమే దానికి కారణం. "ఇక్కడెవరూ రేప్ చేయరు. మీరు సౌకర్యంగా లేకుంటే వారు అవకాశం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. సింపుల్‌గా వాళ్లకు దూరంగా వెళ్లండి. అంత డ్రామా చేయాల్సిన అవసరం లేదు." అని 2018 అక్టోబర్ 9న ట్వీట్ చేసింది. ఇప్పుడు ఆమే స్వయంగా కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశాక, ఆ ట్వీట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దాని స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కశ్యప్‌కు వ్యతిరేకంగా ఆమె చేసిన ఆరోపణల విశ్వసనీయతను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆమెను అవకాశవాదిగా పేర్కొంటూ ట్రోల్ చేస్తున్నారు.
![]() |
![]() |