![]() |
![]() |

నిహారిక కొణిదెల హీరోయిన్‌గా నటించిన తమిళ చిత్రం 'ఒరు నల్ల నాల్ పాతు సోల్రెన్'. విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్ హీరోలుగా నటించారు. 2018లో విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ఆడింది. పి. ఆరుముగ కుమార్ డైరెక్ట్ చేసిన ఆ బ్లాక్ కామెడీ మూవీ ఇప్పుడు తెలుగులో ఓ మంచి రోజు చూసి చెప్తా అనే టైటిల్‌తో అనువాదమైంది. మార్చి 19న విడుదలకు సిద్ధమవుతోంది.
ఒరిజినల్‌లో నిహారిక, గౌతమ్ కార్తీక్ పరస్పరం ప్రేమించుకోగా, నిహారికను పెళ్లాడాలనుకొనే వ్యక్తిగా విజయ్ సేతుపతి నటించాడు. సేతుపతికి మనసిచ్చిన యువతిగా గాయత్రీ శంకర్ కనిపిస్తుంది. చివరకు ఏమైందనేది ఆసక్తికరంగా దర్శకుడు చిత్రీకరించాడు. యమధర్మరాజు భక్తుడిగా విజయ్ సేతుపతి ప్రదర్శించిన నటన ఈ సినిమాకు హైలైట్.

జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్, శరవణన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి బలాన్ని చేకూర్చాయి. అపోలో ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డాక్టర్ రావూరి వెంకటస్వామి 'ఓ మంచి రోజు చూసి చెప్తా' సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

![]() |
![]() |