![]() |
![]() |

అక్కినేని నాగార్జున ప్రతిష్టాత్మక 100వ చిత్రం 'KING 100' అఫీషియల్ గ్లింప్స్ విడుదలైంది. రా కార్తీక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
నేడు(ఆగష్టు 29) నాగార్జున పుట్టినరోజు సందర్భంగా 'కింగ్ 100' గ్లింప్స్ రిలీజ్ చేశారు. నాగార్జున పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్ ప్రారంభమైంది.
"మనుషుల్లో రెండు రకాలు. డబ్బున్నోళ్లు, డబ్బు లేనోళ్లు. డబ్బు లేనప్పుడు నన్ను లూజర్ అన్నారు. డబ్బు ఉన్నప్పుడు కింగ్ అంటున్నారు. ఆ ఐడెంటిటీ అనేది డబ్బు కంటే పవర్ ఫుల్. అందుకే ఆ ఐడెంటిటీని నిలబెట్టుకోవడం కోసం నేను పరిగెడుతూనే ఉన్నాను" అంటూ నాగ్ చెప్పే డైలాగ్ సినిమాలోని డెప్త్‌ని తెలియజేస్తోంది.
నాగార్జున స్క్రీన్ ప్రజెన్స్, వింటేజ్ విజువల్స్, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో.. 'కింగ్ 100' గ్లింప్స్ ఎంతో స్టైలిష్ గా ఉంది. నాగ్ తన 100వ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారని గ్లింప్స్ తో అర్థమవుతోంది.
Also Read: నాగార్జున టాప్ 10 మూవీస్ ఇవే!
ఇక ఈ 'కింగ్ 100' సినిమాను క్రిస్మస్ కానుకగా 2026 డిసెంబర్ 24న విడుదల చేస్తున్నట్లు కూడా మేకర్స్ ప్రకటించారు.
అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న 'NBK111' కూడా డిసెంబర్ 24న విడుదల కానున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఇప్పుడు అదే డేట్ పై 'కింగ్ 100' కర్చీఫ్ వేయడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ క్రిస్మస్ కి బాలకృష్ణ, నాగార్జున బాక్సాఫీస్ వార్ కి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
[Akkineni Nagarjuna, King 100, Birthday Glimpse, Nandamuri Balakrishna, NBK111 Movie, Release Date, Telugu Cinema, Telugu News, Tollywood]
![]() |
![]() |