Home  »  News  »  హయ్యస్ట్ టికెట్ రేట్ ఇదే

Updated : Aug 24, 2026

 

రాకింగ్ స్టార్ యష్ వన్ మాన్ షో 'టాక్సిక్' టెంపరేచర్ అభిమానుల్లోను, ప్రేక్షకుల్లోను రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇందుకు నిదర్శనంగా ముందస్తు బుకింగ్ లో సాధిస్తున్న రికార్డులు చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.ఈ క్రేజ్ ఎంతలా ఉందంటే, ప్రధాన మహానగరాల్లో టికెట్ ధరలు భారీ స్థాయిలో ఉన్నాయి.


 ముఖ్యంగా ముంబై బాంద్రాలోని జియో వరల్డ్ డ్రైవ్ వంటి ప్రీమియం థియేటర్లలో ఎంపిక చేసిన ప్రత్యేక షోల కోసం టికెట్ ధర ఏకంగా 2600 వరకు ఉండగా, బెంగళూరులోని ఫోరమ్ రెక్స్ వాక్ వంటి ప్రసిద్ధ ప్రదేశాల్లో 2,181 గా నమోదైంది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే, కన్నడ వెర్షన్ సగటు టికెట్ రేట్ 404 ,హిందీ వెర్షన్ సగటు టికెట్ ధర  364 గా  కొనసాగుతోంది. ఇంత భారీ ధరలు ఉన్నప్పటికీ, బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే థియేటర్లు హౌస్ ఫుల్ అయిపోవడం యశ్ బాక్సాఫీస్ స్టామినాకి  అద్దం పడుతోంది.  అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే  విడుదల రోజుకి సంబంధించి ఇండియాలోనే  నేరుగా 5,55,328 టికెట్లు అమ్ముడై  21.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. 


Also Read: నిర్మాతగా మారనున్న నిత్యామీనన్.. హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

దేశవ్యాప్తంగా మొత్తం 13,591 షోలలో ఈ భారీ బుకింగ్స్ నమోదుకాగా, హోల్డ్ చేసిన స్థానాలని  (Block Seats) కూడా పరిగణనలోకి తీసుకుంటే విడుదల మొదటి రోజు ముందస్తు గ్రాస్ కలెక్షన్ ఏకంగా 30.14 కోట్లకు చేరుకోవడం ఒక సంచలనం. ఇందులో యశ్ స్వరాష్ట్రమైన కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. కర్ణాటకలో 8.08 కోట్లకు పైగా గ్రాస్ సాధించగా, అందులో రాజధాని బెంగళూరు ఒక్కటే 648 షోల ద్వారా  6.07 కోట్లను రాబట్టింది.  కేవలం దక్షణాదినే కాకుండా ఉత్తరాది మార్కెట్ లో కూడా యశ్ మానియా కొనసాగుతోంది. హిందీ డబ్బింగ్ వెర్షన్ ముందస్తు బుకింగ్స్ లో 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై రూ. 7.35 కోట్ల వసూళ్లను సాధించింది. విదేశాల్లో కూడా ఈ మూవీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తర అమెరికా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటికే 1,63,150 డాలర్ల పైగా గ్రాస్ నమోదు కాగా, 260 కి పైగా ప్రాంతాల్లో 709 షోలకు గాను 7,545 టికెట్లు అమ్ముడయ్యాయి. ఇందులో విచిత్రంగా కన్నడ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ అడ్వాన్స్ కలెక్షన్స్ లో ముందంజలో ఉండటం గమనార్హం. యుఎస్ లో తెలుగు వెర్షన్ ద్వారా 4,359 టికెట్లతో 94,706 డాలర్లు రాగా, కన్నడ వెర్షన్ 3,173 టికెట్లతో 68,246 డాలర్లు వసూలు చేసింది.  

Yash, Toxic, Kaira Adwani, Nayanthara, Geethu Mohandas






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.