![]() |
![]() |

'యాయి రే యాయిరే జోరే లగాకే నాచేరె' అంటూ యూత్ మొత్తం తన గురించే ఆలోచించేలా చేసుకున్న రంగీలా భామ ఊర్మిళ మటోండ్కర్. కింగ్ నాగార్జున తో చేసిన అంతం మూవీతో తో పాటు అనగనగ ఒక రోజు, గాయం చిత్రాలతో తన ఛరిష్మాని మరింతగా పెంచుకుంది. రీసెంట్ గా ఊర్మిళ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో "నాకు ప్రేమ, నమ్మకం (విశ్వసనీయత), సమయం లాంటి అత్యంత ఖరీదైన విషయాలంటేనే చాలా ఇష్టం" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు జోడించింది. ఈ వ్యాఖ్యలు ప్రత్యక్షంగా ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినా, మాజీ భర్త రెండో పెళ్లి మళ్లీ వెలుగులోకి వచ్చిన సమయంలోనే రావడంతో నెటిజన్లు దీనిని ఆమె మాజీ భర్త ఉద్దేశించే పెట్టిందని గట్టిగా భావిస్తున్నారు. ఆమె మాజీ భర్త, కాశ్మీరీ మోడల్ అండ్ బిజినెస్ మెన్ మోహ్సిన్ అఖ్తర్ మీర్ తన రెండో వివాహ రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఫోటోలని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న కొద్ది గంటల్లోనే ఉర్మిళ చేసిన ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది ఊర్మిళ , మోహ్సిన్ అఖ్తర్ మీర్‌ల పరిచయం 2014వ సంవత్సరంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా మేనకోడలి వివాహ వేడుకలో జరిగింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో, 2016 ఫిబ్రవరి 4న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో వీరి పెళ్లి వార్త దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. వీరు వేర్వేరు మతాలకు చెందినవారు కావడమే కాకుండా, ఉర్మిళ కంటే మోహ్సిన్ 10 ఏళ్లు చిన్నవాడు కావడం విశేషం. దాదాపు 8 ఏళ్ల పాటు సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితంలో ఆ తర్వాత తీవ్ర మనస్పర్థలు, విబేధాలు తలెత్తాయి. దాంతో 2024 సెప్టెంబర్ నెలలో ఉర్మిళ ముంబైలోని కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. అలా వీరిద్దరి 8 ఏళ్ల బంధానికి అధికారికంగా తెరపడింది.
Also read: శస్త్ర చికిత్స అప్ డేట్ ఇదే
విడాకుల తర్వాత మోహ్సిన్ అఖ్తర్ మీర్ తన జీవితంలో ముందుకు సాగుతూ నిధా భట్ అనే యువతితో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ ఏడాది జూన్ నెలలోనే నిధా భట్‌తో మోహ్సిన్ వివాహం చాలా గోప్యంగా జరిగింది. అయితే ఇటీవల వారు తమ వివాహ రిసెప్షన్‌ను ఘనంగా జరుపుకోగా, ఆ వేడుకకు సంబంధించిన పిక్స్ మోహ్సిన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. నిధా భట్ తన జీవితంలోకి రావడం గురించి రాస్తూ.. "నువ్వు కేవలం నా భార్యవి మాత్రమే కాదు, నా ఇల్లు, నా మనశ్శాంతి, నా జీవితంలో ప్రతిరోజూ నాకు అత్యంత ఇష్టమైన భాగం అయ్యావు. దేవుడు నిన్ను నా జీవితంలోకి తెచ్చినందుకు ఎంతో కృతజ్ఞుడని అని రాసుకొచ్చాడు.
Urmila Matondkar, Nagarjuna, Tollywood

![]() |
![]() |