Home  »  News  »  నాగవంశీ నమ్మకం: ఆ నిర్మాతలకు 'సార్', 'లక్కీ భాస్కర్' కథలు నచ్చలేదు.! 

Updated : Aug 12, 2026

వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'సార్', 'లక్కీ భాస్కర్' సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి. అయితే ఈ రెండు కథలను కొందరు ప్రొడ్యూసర్లు రిజెక్ట్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా వెంకీ అట్లూరి చెప్పడం విశేషం.

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన 'విశ్వనాథ్ & సన్స్' మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ.. 'రంగ్ దే' సినిమా తర్వాత తాను నాగవంశీ నిర్మాణంలోనే సినిమా చేయడానికి గల కారణాన్ని వివరించారు.

'రంగ్ దే' సినిమా తర్వాత వెంకీ అట్లూరి వేరే ప్రొడ్యూసర్లను కలిసి 'సార్' కథ చెప్పారట. కానీ వాళ్లకు ఆ కాన్సెప్ట్ నచ్చలేదు. ఆ తర్వాత 'లక్కీ భాస్కర్' లైన్ చెప్పారు.. అది కూడా వాళ్లకు కనెక్ట్ అవ్వలేదు.

"మరి ప్రొడ్యూసర్లు రిజెక్ట్ చేసినప్పుడు మీకేమనిపించింది? వాళ్ల మీద కోపం రాలేదా?" అని అడిగితే, వెంకీ అట్లూరి ఇచ్చిన ఆన్సర్ ఆయన మెచ్యూరిటీకి అద్దం పడుతోంది."నాకేం కోపం రాలేదు.. అది ఒక హ్యూమన్ ఎమోషన్. ఒక దర్శకుడికి ఒక సినిమా సరిగ్గా ఆడనప్పుడు, అతని మీద మళ్లీ కోట్లు పెట్టి రిస్క్ చేయడానికి ఏ నిర్మాత అయినా ఆలోచిస్తాడు. నేను ప్రొడ్యూసర్ స్థానంలో ఉన్నా అలాగే ఆలోచిస్తాను" అని చాలా నిజాయితీగా ఒప్పుకున్నారు.

అలాంటి టైమ్‌లోనే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ.. వెంకీ అట్లూరిని పూర్తిగా నమ్మారు. "ఎవ్వరూ నమ్మని కథలను వంశీ గారు నమ్మారు. అందుకే నేను ఆయనతోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాను" అని తన సక్సెస్ వెనుక ఉన్న సపోర్ట్ గురించి చెప్పారు వెంకీ.

 

 

Venky Atluri, Naga Vamsi, Vishwanath And Sons, Sir Movie, Lucky Bhaskar Movie

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.