Home  »  News  »  మోహన్ రాజా డైరెక్షన్‌లో 'కార్తి 31'.. రేసులో త్రిష, నయనతార!

Updated : Aug 9, 2026

కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ కార్తి వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల దర్శకుడు మోహన్ రాజాతో తన 31వ చిత్రాన్ని ('కార్తి 31') అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పూర్తిస్థాయి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ప్రకటించినప్పటి నుంచే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా ఈ చిత్రంలో కార్తి సరసన నటించబోయే కథానాయిక ఎవరనే అంశంపై కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నటించేందుకు ప్రధానంగా ఇద్దరు చెన్నై భామల పేర్లు వినిపిస్తున్నాయి. మొదట మేకర్స్ లేడీ సూపర్ స్టార్ నయనతారను ఎంపిక చేయాలని భావించారు. గతంలో కార్తి-నయన్ కాంబోలో వచ్చిన 'కాశ్మోరా' హిట్ అవ్వడం, అలాగే మోహన్ రాజాతోనూ నయనతారకు మంచి హిట్ ట్రాక్ రికార్డ్ ఉండటం ఇందుకు కారణం. అయితే నయనతార కాల్ షీట్లు, డేట్స్ అడ్జస్ట్ కాకపోతే ప్రత్యామ్నాయంగా గ్లామరస్ స్టార్ త్రిష కృష్ణన్‌ను ఆ స్థానంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ త్రిష ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, మళ్లీ 'పొన్నియిన్ సెల్వన్' కాంబినేషన్ వెండితెరపై పునరావృతం కానుంది. ఆ సినిమాలో కార్తి (వల్లవరాయన్ వందియదేవన్), త్రిష (కుందవై)ల మధ్య సాగిన సీన్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో వీరిద్దరూ మరోసారి పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాలో జంటగా కనిపిస్తే చూడాలని అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. కథానాయిక విషయంలో చిత్రబృందం త్వరలోనే ఒక స్పష్టతనిచ్చి అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో కార్తి సరికొత్త మాస్ అండ్ క్లాస్ లుక్‌లో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

మరోవైపు హీరో కార్తి కేరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో ఆయన నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, కళ్యాణ్ శంకర్ కాంబినేషన్‌లో 'కార్తి 30' చిత్రం కూడా సెట్స్‌పై ఉంది. ఈ బిజీ లైనప్ మధ్య మోహన్ రాజా ప్రాజెక్ట్ కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.