![]() |
![]() |

మూవీ లవర్స్, రామభక్తులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ రామాయణ. భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంతో ముడిపడి ఉన్న దశరధ రాముడు, కోదండ రాముడు, సీతా రాముడి కథ కావడంతో హిందువులంతా రిలీజ్ డేట్ నవంబర్ 8 కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మేకర్స్ కూడా రాముడి హోదాకి తగ్గట్టే మొదటి భాగాన్ని 2000 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. దీన్ని బట్టి ఎంత ప్రెస్టేజియస్ట్ మూవీని అర్ధం చేసుకోవచ్చు.
‘రామాయణ’విడుదలకి ముందే తమ సభ్యుల కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని, లేదంటే దేశవ్యాప్తంగా థియేటర్ల ముందు ఆందోళనలు చేపడతామని ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ హెచ్చరిస్తుంది. ఈ మేరకు శ్రీ రామ్‌లీలా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ చిత్ర యూనిట్‌కి ఒక లేఖ రాశాడు.
ఆ లేఖలో 'సనాతన ధర్మం, సాంప్రదాయ రామలీల ప్రదర్శనలతో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ ముందస్తు ప్రదర్శన అవసరం. హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసే దృశ్యాలు ఏవైనా ఉన్నాయేమోననే అనుమానం కూడా ఉంది. ఒక వేళ ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేయడానికి నిరాకరిస్తే, శ్రీ రామ్‌లీలా మహాసంఘ్‌తో పాటు ఇతర హిందూ సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా సినిమా హాల్స్ వెలుపల నిరసనలు మరియు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు…
ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఆదిపురుష్’ లో లంకని బంగారానికి బదులుగా నలుపు రంగులో చూపడం…, రావణుడి రూపం, పాత్రల దుస్తులు, సంభాషణలు సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయి. అదే తప్పులు మళ్లీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ డిమాండ్ చేస్తున్నాం. హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసే దృశ్యాలు ఏవైనా ఉన్నాయేమోననే అనుమానం కూడా ఉంది. సినిమా విడుదలయ్యే లోపు అటువంటి అభ్యంతరకర దృశ్యాలు లేదా డైలాగులు ఉంటే వాటిని గుర్తించి తొలగించాలి.
also read: ఇక లీగల్ వార్నింగ్ ఉంటుంది.. వైరల్ గా మారిన మృణాల్
ఒక వేళ ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేయడానికి నిరాకరిస్తే, శ్రీ రామ్‌లీలా మహాసంఘ్‌తో పాటు ఇతర హిందూ సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా సినిమా హాల్స్ వెలుపల నిరసనలు మరియు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

![]() |
![]() |