![]() |
![]() |

లేటెస్ట్ హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఈ శుక్రవారం (జూలై 31) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
హారర్, థ్రిల్లర్, యాక్షన్ అంశాలను వినూత్నంగా మిళితం చేస్తూ రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రలు పోషించారు. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించగా, సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. వరలక్ష్మి శరత్‌కుమార్ తన కెరీర్‌లోనే తొలిసారిగా చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దానికి తోడు నవీన్ చంద్ర యాక్టింగ్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది.
ఈ చిత్రంలో "చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ" అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ను హారర్ థ్రిల్లర్ రూపంలో దర్శకుడు సంజీవ్ మేగోటి ఆవిష్కరించారు. హారర్, మిస్టరీ, యాక్షన్ అంశాలను మేళవిస్తూ ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా, సూపర్ స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన కృష్ణసాయి నటించిన ప్రత్యేక గీతం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మూఢనమ్మకాల నేపథ్యంలో కర్మ సిద్ధాంతాన్ని థ్రిల్లింగ్ కథనంతో చూపించిన ‘పోలీస్ కంప్లైంట్’ హారర్, యాక్షన్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది.
Police Complaint, OTT Telugu, Varalaxmi Sarathkumar, Naveen Chandra
![]() |
![]() |