![]() |
![]() |

ప్రభాస్..ఈ పేరు వింటే అభిమానుల్లో, ప్రేక్షకులలో వచ్చే పూనకాల తాలూకు వైబ్రేషన్ ని కొలవడం ఎవరి తరం కాదు. ప్రస్తుతం పౌజీ, కల్కి 2 , స్పిరిట్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ మూడు చిత్రాలు కలిపి 6000 వేల కోట్ల రూపాయలు వసూలు చెయ్యాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారంటే ఆ చిత్రాలపై ఉన్న క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు.
తాజాగా తెలుగు వన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రముఖ సినీ నటుడు, జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి మాట్లాడుతు ప్రభాస్ అన్న ఇప్పుడున్న స్టేజ్ కి వెళ్తాడని అనుకోలేదు. ప్రభాస్ అన్న కూడా అనుకోని ఉండడు. ఫస్ట్ మూవీ 'ఈశ్వర్' లో ఎంతో చనువుగా ఉండే ఫ్రెండ్ క్యారక్టర్ చేశాను. ఆ టైంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి వారసుడు అనే ఫీలింగ్ లేదు. దాంతో అరే, ఒరే అని పిలుచుకునే వాళ్ళం. కొన్ని సినిమాలు చేసిన తర్వాత ప్రభాస్ సార్ అని పిలవాలని కొంత మంది చెప్పారని చెప్పుకొచ్చాడు.
Also read: అన్ని నేనే చేయాలంటున్న హీరో!.. ఆ లిస్ట్ ఇదే
ఈ నెల 31 న ' కర్మాఖ్య ' అనే విభిన్న టైటిల్, సబ్జెట్ తో కూడిన మూవీతో 'అభి' ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ మూవీ ప్రమోషన్స్ లోనే ప్రభాస్ పై మాట్లాడటం జరిగింది. అదే విధంగా 'కర్మాఖ్య' ని ప్రేక్షకులు ఆదరించాలని కూడా కోరాడు.
Prabhas, Adire Abhi, Karmakhya
![]() |
![]() |