![]() |
![]() |

కళ్ళతోనే తన క్యారక్టర్ తాలూకు రియాలిటీని అభిమానులు, ప్రేక్షకుల హృదయాల్లోకి చొచ్చుకొనిపోయేలా చేయాలా నటి మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). ఆ వర్డ్ పై ఎవరికైనా డౌట్ ఉంటే తన ప్రీవియస్ చిత్రాలు చూసీ క్లారిఫై ఇచ్చుకోవచ్చు. ప్రీవియస్ మూవీ డెకాయిట్ కి నెగిటివ్ టాక్ వచ్చినా కూడా మృణాల్ ఇమేజ్ తో భారీగానే కలెక్షన్స్ ని కొల్లగొట్టింది.
చిత్రసీమ, క్రికెట్ ప్రపంచాల మధ్య రిలేషన్ కి సంబంధించిన రూమర్లు సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి.ఈ కోవలోనే టీమిండియా యంగ్ అండ్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మృణాల్ డేటింగ్లో ఉన్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి.ముంబైలోని ప్రముఖ బాంద్రా వెస్ట్‌లో ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన 'బూజీ కేఫే' (Boojee Cafe) వద్ద వీరిద్దరూ కనిపించడమే ఈ వార్తలకు ప్రధాన కారణమైంది. యశస్వి జైస్వాల్ ముందుగా కేఫే నుంచి బయటకు వచ్చి తన కారులోకి వెళ్లిపోతుండగా, అదే సమయంలో మృణాల్ ఠాకూర్ కూడా అదే కేఫే లోపల ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వీరు ఒకరికొకరు కలిసి ఫ్రేమ్‌లో కనిపించనప్పటికీ లేదా ఎలాంటి ప్రైవేట్ సంభాషణలు జరుపుతున్నట్లు నమోదు కాకపోయినప్పటికీ, ఒకే ప్రదేశంలో ఒకే సమయంలో ఇద్దరూ ప్రత్యక్షం కావడం నెటిజన్లలో సందేహాలను పెంచేసింది. దీంతో పలువురు అభిమానులు, సెలబ్రిటీ పేజీలు 'ఇది కొత్త బాలీవుడ్-క్రికెట్ జంటా?' అనే క్యాప్షన్లతో ఈ వీడియోను వేగంగా రీషేర్ చేస్తున్నారు.
ఈ సీక్రెట్ మీటింగ్ ప్రచారంతో పాటు వీరిద్దరి వయసు వ్యత్యాసంపై కూడా సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన చర్చ సాగుతోంది. ప్రస్తుతం నటి మృణాల్ ఠాకూర్ వయసు 33 సంవత్సరాలు కాగా, క్రికెటర్ యశస్వి జైస్వాల్ వయసు కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. వీరిద్దరి మధ్య దాదాపు 9 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. కొందరు నెటిజన్లు వయసు తేడాను ప్రస్తావిస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం ఆధునిక సంబంధాల్లో వయసు ఒక పరిమితి కాదని మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. గతంలో కూడా మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో ప్రేమలో ఉందని, పెళ్లి చేసుకోబోతోందని గట్టిగా రూమర్లు వినిపించగా, తర్వాత అవన్నీ కేవలం అబద్ధాలని తేలిపోయాయి.
Also read: ఆ భారీ సినిమా ఇచ్చే పోటీని ఘట్టమనేని జయకృష్ణ తట్టుకోగలడా.. ఫ్యాన్స్ ఏమంటారో!
అయితే, ఈ కేఫే దృశ్యాలు కేవలం ఒక సాధారణ యాడ్ షూట్, బ్రాండ్ కొలాబరేషన్ లేదా బిజినెస్ మీటింగ్‌కి సంబంధించినవి కావచ్చునని నెటిజన్లలో ఒక వర్గం అభిప్రాయపడుతోంది. ముంబై బాంద్రాలోని కేఫేలలో తరచూ రకరకాల సెలబ్రిటీలు వస్తుంటారని, కేవలం ఒకే చోట కనిపించినంత మాత్రాన వారిద్దరూ ప్రేమలో ఉన్నారని ముగింపునకు రావడం తొందరపాటు అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ వైరల్ వీడియోపై లేదా డేటింగ్ రూమర్లపై మృణాల్ ఠాకూర్ కానీ, యశస్వి జైస్వాల్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నిజానిజాలు ఏమిటనేది ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
Muranl Thakur, Bollywood

![]() |
![]() |