Home  »  News  »  హిట్ కొట్టిందా లేక ఫ్లాప్ అయ్యిందా? వాళ్ళు చెప్తున్న మాటలు ఇవే

Updated : Jul 24, 2026

 

 

ప్రెజెంట్ కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram),శ్రీ గౌరీ ప్రియ(Sri Gouri Priya),చెన్నై లవ్ స్టోరీ'(Chennai Love Story)తో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. 'బేబీ' వంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ఎస్‌కేఎన్, ధీరజ్ మొగిలినేనితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ రచయిత రవి నంబూరి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సంగీత బ్రహ్మ మణిశర్మ అందించిన స్వరాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్  విడుదలకు ముందే భారీ అంచనాలని  పెంచేశాయి. 


 దీంతో ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టిన చెన్నై లవ్ స్టోరీ కి అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా భారీగానే పోటెత్తారు. నిన్న నైట్ ప్రీమియర్స్ నుంచే హంగామా మొదలైంది.  ఈ నేపథ్యంలొ బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యిందా లేక యావరేజ్/ఫ్లాప్ టాక్ తెచ్చుకుందా అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.  కథ విషయానికి వస్తే, 3 ఏళ్ల పాటు ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి పీటలు ఎక్కే సమయంలో కథానాయిక నివేదిత అలియాస్ నివి (శ్రీ గౌరీ ప్రియ)కి ఆమె ప్రియుడు అజయ్ (త్రిగుణ్) హ్యాండ్ ఇస్తాడు. వేరే అమ్మాయిని ప్రేమించానని చెప్పి బ్రేకప్ చెప్తాడు. తీవ్రమైన డిప్రెషన్‌కి గురైన నివి, బ్రేకప్ బాధ తట్టుకోలేక మందుకి బానిసవుతుంది. ఆమెను ఆ బాధ నుంచి బయటపడేసేందుకు స్నేహితులు చెన్నై తీసుకువెళ్తారు. అదే సమయంలో చెన్నైలో సినీ దర్శకుడు కావాలని ప్రయత్నిస్తున్న స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) పరిచయమవుతాడు. స్టీవెన్ తింగరి పనులు, అతని ప్యాషన్ చూసి నివి నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తుంది. అతనికి ఒక అవకాశాన్ని ఇప్పించడంతో పాటు, మళ్లీ అతని ప్రేమలో పడుతుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిన సమయంలో కథ ఒక అనూహ్యమైన మలుపు తిరుగుతుంది.

Also read: ఈ వీకెండ్ మిస్ అవ్వకండి.. 25 సినిమాలు మీ కోసమే 

మూవీకి అయితే థియేటర్ల వద్ద,సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. మొదటి భాగం సరదా సన్నివేశాలు, మంచి ఫీల్ గుడ్ ఎమోషన్స్, మణిశర్మ అందించిన పాటలతో చాలా వేగంగా సాగిపోతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ లో ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథానాయికగా శ్రీ గౌరీ ప్రియ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకోగా, కిరణ్ అబ్బవరం తన పరిధి మేరకు చక్కగా నటించాడు.  మణిశర్మ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది.  అయితే, సెకండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత దర్శకుడు తీసుకున్న కథన విధానం కొంతవరకు ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. 'ఎందుకంటే ప్రేమంట' వంటి సినిమాలను గుర్తుచేసే లాజిక్ లేని మ్యాజిక్ ఎలిమెంట్స్, సాగదీసినట్టు ఉండే సన్నివేశాలు సెకండ్ హాఫ్‌లోని ఎమోషన్‌ దెబ్బతీశాయని కొంత మంది మీడియా సముఖంగా చెప్తున్నారు.  దీంతో యావరేజ్ చిత్రంగా మిగలవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదే టైంలో లవ్ స్టోరీస్, ఎమోషనల్ డ్రామాలని ఇష్టపడే వారు మాత్రం మూవీ చాలా బాగుందని చెప్తూ, మూవీ చూసి కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ రోజు తొలి రోజు కాబట్టి కన్ఫ్యూజ్ తో కూడిన టాక్ వస్తుంది. రేపు ఎలాంటి టాక్  వస్తుందో చూడాలి.

chennai love story, kiran abbavaram, sri Gouri Priya, tollywood






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.