Home  »  News  »  ఈ వీకెండ్ మిస్ అవ్వకండి.. 25 సినిమాలు మీ కోసమే

Updated : Jul 24, 2026

 


వాతావరణం చేంజ్ అయినా నాలో మాత్రం ఎలాంటి చేంజ్ లేదు, అంతకంత సినీ వినోదాన్ని అందివ్వడానికి ఓటిటి వేదిక డిజిటల్ వినోదాల పండుగలా మారబోతోంది. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల్లోనే ఓటీటీలోకి వస్తున్న బ్లాక్‌బస్టర్ సినిమాలు ఒకవైపు, వైవిధ్యమైన కథాంశాలతో ఉక్కిరిబిక్కిరి చేసే థ్రిల్లర్ సిరీస్‌లు మరొకవైపు డిజిటల్ వేదికలపై సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, సోనీలివ్, ఈటీవీ విన్ వంటి దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఏకంగా 25ki పైగా కొత్త సినిమాలు వెబ్ సిరీస్‌లు వివిధ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీకెండ్‌లో ఇంటి పట్టునే ఉండి రిలాక్స్ అవ్వాలనుకునే సినిమా ప్రేమికులకు ఇది నిజంగానే ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు.

ఈ వారం ఓటీటీలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న చిత్రాల్లో 'నాగబంధం' అగ్రస్థానంలో నిలుస్తోంది. విరాట్ కర్ణ కథానాయకుడిగా, నభా నటేష్, ఐశ్వర్య మేనన్ కథానాయికలుగా నటించిన ఈ పాన్-ఇండియా యాక్షన్ అడ్వెంచర్ మూవీకి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. జులై 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, కేవలం నెల రోజుల వ్యవధిలోనే ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అందుబాటులోకి రావడం విశేషం. పురాతన నిధుల రహస్యాలు, నాగబంధం సంప్రదాయాలతో నిండిన ఈ విజువల్ వండర్ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇక పోలీస్ డ్రామాలు, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వీక్షకులకు ఈటీవీ విన్ (ETV Win) వేదిక సరికొత్త అనుభూతిని అందిస్తోంది. దేవి ప్రసాద్ శెట్టి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కన్నడ సూపర్ హిట్ థ్రిల్లర్ 'కేస్ ఆఫ్ కొండాన' ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చింది. విజయ్ రాఘవేంద్ర, భావన మేనన్ కీలక పాత్రల్లో జీవించిన ఈ సినిమా కథాంశం ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. తెలియక చేసిన ఒక చిన్న పొరపాటును కప్పిపుచ్చుకునేందుకు చేసే వరుస తప్పులు మనిషి జీవితాన్ని ఎంతటి ముప్పులోకి నెడతాయో ఈ చిత్రంలో అత్యంత ప్రతిభావంతంగా చూపించారు.

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో అద్భుతమైన కథా చిత్రం 'పళ్లిచట్టంబి'. కేరళలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో టొవినో థామస్, కయాదు లోహర్ జంటగా నటించారు. డిజో జోస్ ఆంటోని నిర్దేశత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో మెరిశారు. థియేటర్లలో విశేష ఆదరణ పొందిన ఈ సినిమా ప్రస్తుతం సోనీలివ్ (Sony LIV) లో మలయాళంతో పాటు తెలుగు వర్షన్‌లోనూ స్ట్రీమింగ్ అవుతూ సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మరోవైపు గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకుల కోసం హిందీ మరియు తెలుగు భాషల్లో 'ముసాఫిర్ కెఫే' అనే డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌ను అందుబాటులోకి తెచ్చింది. విక్రాంత్ మాస్సే, వేదికా పింటో, మహిమా మక్వానా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ను రుచిర్ అరుణ్ తెరకెక్కించారు. టెరిబ్లీ టైనీ టేల్స్ సంస్థ నిర్మించిన ఈ డ్రామా యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో పవన్ కల్యాణ్, సప్తగిరి, రాజ్‌కుమార్ కసిరెడ్డి ముఖ్య పాత్రల్లో రూపుదిద్దుకున్న 'పురుషః' చిత్రం మరియు హిందీ కామెడీ సిరీస్ 'ఆదర్శ బాల విద్యాలయ' కూడా వీక్షకులను అలరిస్తున్నాయి.

Also read: పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, విజయ్ పై బాబీ డియోల్ షాకింగ్ కామెంట్స్ 


వీటితో పాటు అంతర్జాతీయ కంటెంట్ ఇష్టపడే వారి కోసం నెట్‌ఫ్లిక్స్‌లో 'ఎలైట్ ఫోర్స్', 'ద డెట్ కలెక్టర్', '1941', '72 అవర్స్' వంటి 8కి పైగా ఇంగ్లీష్, తమిళ చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో 'ఇగో రమణ్', 'అనోమి' వంటి ప్రాంతీయ భాషా చిత్రాలతో పాటు సబ్‌స్క్రైబర్లను మైమరిపించేందుకు దాదాపు 25కు పైగా విభిన్న రకాల ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ శని, ఆదివారాల్లో మీకు నచ్చిన జానర్ కథలను ఎంచుకుని డిజిటల్ వినోదాన్ని ఆస్వాదించండి!

naga bandham, ott movies, anomi, elite force






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.