![]() |
![]() |

చందమామ కాజల్ అగర్వాల్ టాలీవుడ్లో దశాబ్ద కాలానికి పైగా స్టార్ హీరోయిన్గా తన హవా కొనసాగించింది. పెళ్లి తర్వాత, ఒక బాబుకు జన్మనిచ్చిన తర్వాత కూడా తన గ్లామర్, ఫిట్నెస్ను కాపాడుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. త్వరలో 'ది ఇండియా స్టోరీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆహార కల్తీ వల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడిందనే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
'ది ఇండియా స్టోరీ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా, తాజాగా కాజల్ అగర్వాల్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత ఆహారపు అలవాట్లకు సంబంధించి ఒక సంచలన విషయాన్ని పంచుకుంది. తానే స్వయంగా ఒకప్పుడు ఎంతో ఇష్టంగా తినే పుచ్చకాయలను ఇప్పుడు పూర్తిగా తినడం మానేశానని, వాటిని చూస్తేనే తనకు ఎంతో భయం వేస్తోందని ఆవిడ వెల్లడించింది. స్టార్ హీరోయిన్ నోటి నుండి వచ్చిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో, హెల్త్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు దారితీశాయి.
ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ఆపిల్స్ వంటి పండ్లకు ఇంజెక్ట్ చేస్తున్న రసాయనాలు, కూరగాయలకు వాడుతున్న మందుల గురించి ప్రస్తావించగా, కాజల్ స్పందిస్తూ మార్కెట్లో జరుగుతున్న ఫుడ్ అడల్ట్రేషన్ (ఆహార కల్తీ) గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. "మార్కెట్లో పుచ్చకాయలకు సంబంధించి జరిగిన ఒక కల్తీ కేసు గురించి నేను విన్నాను. ఆ వార్త విన్నప్పటి నుండి నాకు ఎంతగానో భయం వేసింది. ఆ భయంతోనే నేను పుచ్చకాయలు తినడం పూర్తిగా ఆపేశాను. ఇది నవ్వులాటగా అనిపించినప్పటికీ, నిజానికి ఇది అస్సలు జోక్ కాదు. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది" అని కాజల్ అగర్వాల్ ఎంతో ఆవేదనగా పేర్కొంది. కేవలం పండ్ల వ్యాపారంలోనే కాకుండా మనం రోజువారీగా వాడే కనీస వస్తువులలో కూడా కల్తీ ఏ రేంజ్లో ఉందో ఆవిడ వివరించింది.
మనం నిత్యం అమాయకంగా తాగే ప్యాకెట్ పాలు గురించి కూడా కాజల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న కమర్షియల్ మిల్క్ ప్యాకెట్లలో అసలు పాల కంటెంట్ అనేది చాలా తక్కువ శాతంలో ఉంటోందని, కేవలం కెమికల్స్, పౌడర్లతో వాటిని తయారు చేస్తున్నారని ఆవిడ చెప్పింది. "నిజానికి మనం ప్రతిరోజూ ఉదయం లేచింది మొదలు మన జీవితాంతం ఆ పాలనే వాడుతున్నాం. మన పిల్లలకు కూడా ఇస్తున్నాం. కానీ అందులో ఏమాత్రం అసలైన పాలు లేవనేది చేదు నిజం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏది నిజమైన ఆహారం? దేన్ని మనం నమ్మి తినాలి? ఏది తినకూడదు? అనేది ఒక సామాన్యుడు ఎలా అర్థం చేసుకోగలడు?" అంటూ కాజల్ అగర్వాల్ నేటి సమాజంలో జరుగుతున్న వ్యాపార కల్తీ విధానాన్ని ప్రశ్నించింది. సెలబ్రిటీ హోదాలో ఉండి కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, ఆహార భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Kajal Aggarwal, Interview, The India Story, TeluguOne
![]() |
![]() |