Home  »  News  »  కమల్‌హాసన్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన యోగిబాబు.. సంచ‌ల‌నం సృష్టించిన క‌మెడియ‌న్‌!

Updated : Jul 5, 2026

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒకే నటుడు బహుళ పాత్రలు పోషించడం ఎప్పుడూ ఒక పెద్ద సంచలనమే. గతంలో నటనకు నిలువెత్తు రూపం లాంటి దివంగత మహానటుడు శివాజీ గణేశన్ 'నవరాత్రి' సినిమాలో తొమ్మిది పాత్రలు పోషించి అప్పట్లో ఒక అరుదైన మైలురాయిని సృష్టించారు. ఆ తర్వాత లోకనాయకుడు, విశ్వనటుడు కమల్ హాసన్ 'దశావతారం' చిత్రంలో ఏకంగా 10 విభిన్న పాత్రల్లో ఒదిగిపోయి యావత్ సినీ ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేశారు. ఎన్నో  సంవ‌త్స‌రాలుగా చెక్కుచెదరకుండా ఉన్న కమల్ హాసన్ 10 పాత్రల రికార్డును బ్రేక్ చేసేందుకు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ స్టార్ కమెడియన్‌గా దూసుకుపోతున్న యోగి బాబు సరికొత్త సాహసానికి తెరలేపారు. ఊహించని విధంగా ఒకే సినిమాలో ఏకంగా 11 విభిన్న పాత్రలతో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఆయన సిద్ధమయ్యారు. తనదైన మేనరిజం, డిఫరెంట్ హెయిర్ స్టైల్, టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే యోగి బాబు.. ఈసారి కేవలం నవ్వించడమే కాదు, తనలోని నటుడిని సరికొత్తగా ఆవిష్కరించేందుకు రెడీ అయ్యారు.

ఈ భారీ ప్రాజెక్టు ద్వారా యోగి బాబు కామెడీ పాత్రలకే పరిమితం కాకుండా.. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా అంటే హీరోగా మరియు విలన్‌గా రెండు ప్రధాన పాత్రలతో పాటు మరో తొమ్మిది ఇతర విభిన్న పాత్రలలో కనిపించనున్నారు. మొత్తం 11 పాత్రల్లోనూ వేర్వేరు బాడీ లాంగ్వేజ్, విభిన్నమైన లుక్స్ మరియు ప్రత్యేకమైన యాసలతో మాట్లాడటం ఈ సినిమా యొక్క ప్రధాన ఆకర్షణ కానుంది. ఇందులో కొన్ని కవల పిల్లల క్యారెక్టర్లు కూడా ఉండటం విశేషం. ఒకే నటుడు 11 పాత్రల్లో మెప్పించడం అంటే మామూలు విషయం కాదు, కానీ యోగి బాబు ఈ భారీ ఛాలెంజ్‌ను స్వీకరించి ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురిచేస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆర్. కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడిగా ఆయనకు ఇది మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమా కథాంశం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఇది హై-ఎనర్జీతో సాగే యాక్షన్ కామెడీ థ్రిల్లర్ అని తెలిపారు. ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక సైనిక హెలికాప్టర్ ప్రమాదానికి గురవుతుందని, ఆ హెలికాప్టర్‌లోని అత్యంత కీలకమైన 'బ్లాక్ బాక్స్'ను కనుగొనే ప్రయత్నంలో సాగే ప్రయాణమే ఈ సినిమా అని వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను కనుగొనడానికి బయలుదేరిన హీరో ఎదుర్కొనే సవాళ్లను వినోదం మరియు యాక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు.

పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో విడుదల కానున్న ఈ భారీ చిత్రంలో మలయాళ నటి అదితి రవి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రెడిన్ కింగ్స్లీ, విటివి గణేష్, పంజు సుబ్బు, ఎ. వెంకటేష్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు జి. బాలమురుగన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, 'తని ఒరువన్' ఫేమ్ గోపి కృష్ణ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ రెండో షెడ్యూల్ షూటింగ్‌ను యునైటెడ్ కింగ్‌డమ్ (ఇంగ్లాండ్) మరియు కెన్యా దేశాల్లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ధర్మప్రభు, గూర్ఖా, మండేలా వంటి సినిమాలతో మెప్పించిన యోగి బాబు.. ఇప్పుడు 11 పాత్రలతో కమల్ హాసన్ రికార్డును దాటబోతుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

 

 

 

Yogi Babu 11 roles, Yogi Babu breaks Kamal Haasan record, Dasavathaaram record broken, Yogi Babu new movie, Kollywood movie updates, Yogi Babu hero and villain






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.