![]() |
![]() |

తన రాజకీయపార్టీ నడపడం కోసం సినిమాలు చేస్తానని చెప్పిన మాటకి అనుగుణంగానే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ప్రీవియస్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవ్వగా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీ లోను తీవ్ర నిరాశ పరిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నటనకి పూర్తిగా స్వస్తి చెప్పనున్నారనే ప్రచారం సినీ, రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఊపందుకుంది.
అయితే ఈ వార్తలపై ఇండస్ట్రీ వర్గాల నుంచి అసలు నిజం బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించడం లేదని, రాజకీయ బాధ్యతల దృష్ట్యా కేవలం ఒక సుదీర్ఘ విరామం (గ్యాప్) మాత్రమే తీసుకోబోతున్నారని స్పష్టమవుతోంది..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ‘ఓజీ 2’ తో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో జైత్ర రామా మూవీస్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం ఉంది. ఈ రెండు చిత్రాలని కూడా కొంత గ్యాప్ తీసుకొని చేయనున్నట్టుగా తెలుస్తుంది.
Also read: Peddi: పెద్ది ఆరు రోజుల కలెక్షన్స్ ప్రకటించిన మేకర్స్
![]() |
![]() |