![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తన వన్ మాన్ షో పెద్ది(Peddi)తో సందడి చేస్తున్నాడు. సందడి చేస్తుండటమే కాకుండా కధాంశంతో పాటు కొన్ని క్యారెక్టర్స్ ప్రెజెంటేషన్ విషయంలో దర్శకుడు బుచ్చిబాబు ప్రత్యేక శ్రద్ద కనపర్చలేదనే మాటలు వస్తున్నా చరణ్ మాత్రం తన ఒంటి చేత్తో పెద్దిని ముందుకు నడిపిస్తున్నాడు.
పెద్ది రిలీజ్ రోజు నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తున్నప్పటికీ, నాన్, తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ మార్కెట్లలో మాత్రం ఊహించని విధంగా తీవ్ర నిరాశజనకమైన లెక్కల్లో ఉంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం తెలుగు వెర్షన్ మినహా మిగిలిన అన్ని భాషల్లోనూ మరియు విదేశీ మార్కెట్లలో భారీ నష్టాల దిశగా అడుగులు వేస్తునట్టుగా తెలుస్తుంది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఫస్ట్ వీకెండ్ ముగిసేనాటికి 'పెద్ది' చిత్రం హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడింది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించిన పెద్ది నాలుగు రోజుల్లోనే 300 కోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని బయ్యర్లని సురక్షితమైన లాభాల జోన్‌లోకి తీసుకెళ్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్, బోర్డర్ దాటితే మాత్రం పూర్తిగా చతికిలపడింది. ముఖ్యంగా హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఆశించిన స్థాయిలో కనీస ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది.
Also read: Janhvi kapoor: జాన్వీకపూర్‌కి మరో భారీ మూవీలో ఛాన్స్.. సినిమానే కాబట్టి భయపడకండి
ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ చరణ్ కెరీర్‌లోనే అత్యధిక రేట్స్ పలికాయి. నార్త్ అమెరికాలోనే ఏకంగా 7 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఐదో రోజు నాటికి ఓవర్సీస్ మార్కెట్ లో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఐదో రోజు విదేశాలలో కేవలం కోటి మాత్రమే వసూలు చేయడంతో, ఓవర్సీస్ మొత్తం గ్రాస్ 47 కోట్ల వద్దే నిలిచిపోయింది. దీంతో విదేశీ మార్కెట్లలో బ్రేక్ ఈవెన్ సాధించడం దాదాపు అసాధ్యమని, అక్కడ డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని స్పష్టమవుతోంది. ఫైనల్ గా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల అండతో పెద్ది గట్టెక్కినప్పటికీ, నాన్, తెలుగు, ఓవర్సీస్ బయ్యర్లకు మాత్రం షాక్ ఇచ్చిందనే న్యూస్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.
![]() |
![]() |