![]() |
![]() |

జాన్వీకపూర్(Janhvi kapoor)ప్రస్తుతం పెద్దితో కలిసి థియేటర్స్ లో సందడి చేస్తుంది. సందడి చేస్తుండటమే కాదు గత ఏడాది 'దేవర'తో విజయాన్ని అందుకున్న జాన్వీ ఇప్పుడు పెద్దితో కూడా విజయాన్ని అందుకుంది. దీంతో తన అప్ కమింగ్ తెలుగు ప్రాజెక్ట్స్ న్యూస్ కోసం అభిమానులు ఎదురుచూస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో 'తుంబాడ్' వంటిభయానక చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ రాహి అనిల్ బర్వే దర్శకత్వంలో జాన్వీ ఒక సరికొత్త హారర్ డ్రామాలో నటించబోతున్నట్లు సినీ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది. జాన్వీ తన ప్రీవియస్ చిత్రాలైన గుంజన్ సక్సేనా', 'మిలీ', 'గుడ్‌లక్ జెర్రీ' వంటి విభిన్న కథాంశాలతో గ్లామర్ రోల్స్ కే పరిమితం కాకుండా నటిగా తనలోని ప్రతిభని నిరూపించుకుంది. ఇప్పుడు రాహి అనిల్ బర్వే కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ కేవలం ఒక సాధారణ దెయ్యం కథలా కాకుండా, సరికొత్త క్రియేచర్ బేస్డ్ భయానక చిత్రంగా (జీవి-ఆధారిత భయానక కథ) రూపొందనుందని సమాచారం. ఈ సినిమాని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ 'జియో స్టూడియోస్' అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం జాన్వీతో జరుగుతున్న చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని, ఈ ఏడాది చివర్లోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుందని ఇన్సైడ్ టాక్.
బాలీవుడ్‌లో కమర్షియల్ హిట్లు లేకపోయినా విభిన్నమైన సబ్జెక్టులని ఎంచుకునే జాన్వీ, ఈ క్రియేచర్ హారర్ మూవీలో చేస్తే కెరీర్‌కి మైలురాయిగా మారుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ క్రేజీ హారర్ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
![]() |
![]() |