Home  »  News  »  Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్ 

Updated : Apr 28, 2026

 

మనిషికి నిజమైన సంతోషాన్ని అందించే సాధనం ఏదైనా ఉంది అంటే అది కేవలం   సినిమానే. ఈ క్రమంలో తన డైలీ అప్ డేట్స్ ని సినిమా అనేది మన ముందు ఉంచుతుంది.మరి ఈ రోజు అప్ డేట్స్  ఏంటో చూద్దాం

టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్ చూద్దాం..

1 .మహేష్ బాబు - రాజమౌళి 'వారణాసి' నెక్స్ట్ షెడ్యూల్
రాజమౌళి  మహేష్ బాబు నటిస్తున్న భారీ అడ్వెంచర్ డ్రామా 'వారణాసి' గురించి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను అంటార్కిటికాలోని 'రోస్ ఐస్ షెల్ఫ్' వద్ద ప్లాన్ చేశారు. అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకుంటున్న మొదటి భారతీయ చిత్రంగా కూడా రికార్డు సృష్టించనుంది.

2. రామ్ చరణ్ 'పెద్ది' సాంగ్ లీక్
 రామ్ చరణ్  'పెద్ది' (Peddi)కి సంబంధించి ఒక సాంగ్ బిట్ సోషల్ మీడియాలో లీక్ అయింది. ఎవరు లీక్  చేసారో తెలియదు గాని సదరు లీక్డ్ విజువల్స్‌లో చరణ్ ఊరమాస్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఫ్యాన్స్  అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు. పెద్ది వరల్డ్ వైడ్ గా  జూన్ 25, 2026న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

3. నాని 'ది ప్యారడైజ్' యాక్షన్ సీక్వెన్స్ లీక్
రామ్ చరణ్ సినిమాతో పాటే నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' నుండి కూడా ఒక భారీ యాక్షన్ సీన్ లీక్ కావడం కలకలం రేపుతోంది. ఈ రెండు సినిమాల మేకర్స్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. 

 4 .  అషు రెడ్డి ఆడియో లీక్స్ కలకలం
పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయల నగదు, ఆస్తులు వసూలు చేయడమే కాకుండా ప్రాణహాని తలపెడుతుందంటు  ధర్మేంద్ర అనే NRI పోలీసులను ఆశ్రయించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి  అషు రెడ్డి  ఆడియో క్లిప్పులు బయటకు వచ్చాయి. నేను తీసుకున్న డబ్బులో కోటిన్నరే ఇస్తాను. మిగతా డబ్బులు లైఫ్ లో సెటిల్ అవ్వగానే ఇస్తాను. ఈ ప్రాసెస్ కి ఒకే అనకపోతే మా ఇంటికి వచ్చి వేదిస్తున్నావని బెదిరింపుల కేసు పెడతాను. వేణుస్వామి. ప్రవీణ్ అక్క తో కలిసి రాజీ చేసుకుందాం. నీ ముఖం చూడటానికి కూడా నాకు ఇష్టం లేదని వార్నింగ్ లా అషురెడ్డి మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి

5 . పోకిరి కి 20 ఏళ్ళు 

తెలుగు సినిమా చరిత్రని 'పోకిరి'కి ముందు 'పోకిరి'కి తర్వాత అని విభజించవచ్చు. 2006 ఏప్రిల్ 28న సరిగ్గా ఈ రోజే రిలీజ్ అయ్యింది. అంటే పోకిరి వయసు 20 ఏళ్ళు. దీంతో ఈ రోజు స్పెషల్ డేట్ గా మారడంతో ఫ్యాన్స్ అందరు పోకిరి మూడ్ లో ఉన్నారు.  ఆగస్టు లో  పోకిరి రీ రిలీజ్ కానున్నట్టుగా చిత్ర యూనిట్ కూడా తెలిపింది.

6 . చెమటోడుస్తున్న ఘట్టమనేని వారసుడు
జయకృష్ణ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శ్రీనివాస మంగాపురం'. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకి చేరుకుంది. ప్రస్తుతం అత్యంత కీలకమైన ఇంటెన్స్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఒక క్వారీలో హీరో జయకృష్ణ, విలన్ అజయ్ గ్యాంగ్ మధ్య జరిగే హై-వోల్టేజ్ ఫైట్ సీన్లు తెరకెక్కుతున్నాయి.
విశేషం ఏమిటంటే. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా జయకృష్ణ ఎంతో డెడికేషన్‌తో ఈ యాక్షన్ పార్ట్‌లో పాల్గొంటున్నాడు. 

7 . చిరంజీవి ఫ్యాన్స్ అసంతృప్తి

చిరు,బాబీ ల మూవీకి 'కాకాజీ' అనే టైటిల్‌ని ఫిక్స్ చేయబోతునట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీంతో మెజారిటీ మెగా ఫ్యాన్స్ నెట్టింట్లో తిష్ట వేసి 'చిరంజీవి వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి  'కాకాజీ' టైటిల్ ఏమాత్రం సెట్ అవ్వదు. పైగా చాలా సాఫ్ట్‌గా ఉండటంతో పాటు వినడానికి ఇబ్బందిగా ఉంది. దయచేసి టైటిల్ కాకాజీ కాదని నోట్ రిలీజ్ చేయాలనీ కోరుతున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి చిరు టెస్ట్ లుక్ ఈ రోజు జరిగింది.


8 . నాగార్జున 100వ చిత్రంలో కన్ఫార్మ్ అయిన టబు

నాగార్జున 100వ చిత్రం షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో టబు చేయడం కన్ఫార్మ్ అయ్యింది. ఈ విషయానికి ద్రువీకరిస్తు టబు తన ఇన్ స్టా అకౌంట్ లో ఒక సోఫాలో 100 చిత్రానికి సంబంధించిన క్లాప్ బోర్డు ఉంచింది. ఇప్పుడు ఈ న్యూస్ తో ఇరువురి కాంబో అభిమానుల్లో జోష్ వచ్చింది. పైగా నాగ్ ఇరవై ఐదేళ్ల యువకుడిగా కూడా కనిపించబోతున్నాడనే టాక్  నేపథ్యంలో టబు రోల్ పై మరింత ఆసక్తి పెరిగిందని చెప్పవచ్చు.

9 . పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న కట్టప్ప కూతురు
బాహుబలి కట్టప్ప అలియాస్ సత్య రాజ్ కూతురు దివ్య మాట్లాడుతు 'పెళ్లి అనేది ప్రతి ఒక్కరికీ అవసరమని నేను భావించడం లేదు. ఒక పురుషుడు, ఒక స్త్రీ పరస్పరం ఇష్టపడితే కలిసి జీవించవచ్చు. దానికి పెళ్లి అనే ముద్ర అవసరం లేదు. పెళ్లి చేసుకుంటేనే పిల్లల్ని కనాలనే నిబంధన కూడా అక్కర్లేదు. నా వరకైతే పెళ్లి చేసుకోకుండానే తల్లిని కావడానికి సిద్ధం. ఒక మహిళకి తన శరీరంపై పూర్తి హక్కు ఉంటుందని చెప్పుకొచ్చింది. 

10 . లెనిన్ డేట్ మళ్ళీ మారబోతుందా!

అఖిల్ అండ్ అక్కినేని ఫ్యాన్స్ ప్రెస్టేజియస్ట్ మూవీ లెనిన్.  జూన్ 26న రిలీజ్ కాబోతుందని మేకర్స్ పోస్టర్  రిలీజ్ చేసారు. కానీ ఈ డేట్ నుంచి  మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందుకు పెద్దినే కారణమని రీసెంట్ గా పెద్దిని జూన్ 25 న రిలీజ్ చేస్తామని బుచ్చిబాబు ప్రకటించాడు. కాబట్టి లెనిన్ రిలీజ్ డేట్ మారవచ్చనేది టాక్. పెద్ది వల్లనే ఫస్ట్ రిలీజ్ డేట్ మే 1 నుంచి కూడా లెనిన్ మారిన విషయం తెలిసిందే.

   






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.