![]() |
![]() |

'అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా, రంభ ఊర్వశికైనా ఇంత అందం సాధ్యమా.. సిల్వర్ స్క్రీన్ పై మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)ని చూసిన వాళ్ళు ఈ పాట పాడుకోకుండా ఉండరు. అంతలా తన నటనతో అభిమానుల, ప్రేక్షకుల హార్ట్ బీట్ ని తన ఆదీనంలో ఉంచుకుంటుంది. రీసెంట్ గా వచ్చిన 'డెకాయిట్' నే ఒక ప్రత్యక్ష సాక్షి. సదరు చిత్రానికి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయినా కలెక్షన్స్ బాగా రావడంతో మృణాల్ ఎంత గోల్డెన్ లెగ్ నో అనే విషయం కూడా బయటపడింది. ప్రెజెంట్ మృణాల్ ఒప్పుకున్న ఒక ప్రాజెక్ట్ కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాని ఊపిరి సలపనంత బిజీగా మార్చేసింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం
స్టార్ హీరో ధనుష్(Dhanush),మృణాల్ కాంబోలో ఒక మూవీ తెరకెక్కబోతుందనే వార్తలు ఇండియన్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. కాకపోతే ధనుష్ హీరో కాదు. దర్శకుడు. ధనుష్ ఇప్పటికే స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాడని, 1960ల నాటి పీరియడ్ డ్రామాతో కూడిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అని, మృణాల్ క్యారక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్., ఇప్పటికే మృణాల్ క్యారక్టర్ కి సంబంధించిన 'లుక్ టెస్ట్' పూర్తయిందని, త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని చెప్తున్నారు.
Also read: Prithviraj Sukumaran: గ్యాంగ్ స్టర్ అమిర్ అలీ ఎవరు.. పృథ్వీరాజ్ సుకుమారన్ సరైన సమాధానం చెప్తాడా
ధనుష్, మృణాల్ ప్రేమలో ఉన్నారనే న్యూస్ గత కొంత కాలంగా వినిపిస్తుంది. దీంతో ప్రియుడు డైరెక్షన్ లో మృణాల్ చేస్తుందనే న్యూస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వాళ్ళకి తెలియని నిజం ఏంటంటే మృణాల్ స్వయంగానే ఈ విషయంపై మాట్లాడుతు ధనుష్ మంచి స్నేహితుడని చెప్పుకొచ్చింది. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ధనుష్ కేవలం దర్శకుడిగానే ఉంటాడా లేక స్క్రీన్ పై కూడా కనిపిస్తాడా అనేది చూడాలి.
.webp)
![]() |
![]() |