![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' (Peddi) సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 'ఉప్పెన' వంటి బ్లాక్బస్టర్ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్, చరణ్ రెమ్యునరేషన్ కి సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్స్ వెలుగులోకి వచ్చాయి.
రికార్డు రెమ్యునరేషన్!
టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, 'పెద్ది' సినిమా కోసం రామ్ చరణ్ రూ. 120 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నట్లు తెలుస్తోంది. తన కెరీర్లోనే ఇది అత్యధిక రెమ్యునరేషన్ కావడం విశేషం. దీనితో ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ల సరసన వంద కోట్ల క్లబ్ హీరోల జాబితాలో చరణ్ కూడా చేరారు. ఈ సినిమాకి సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం.
షూటింగ్ ముగింపు.. గ్రాండ్ రిలీజ్ ఫిక్స్!
'పెద్ది' షూటింగ్ కు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ ను మూవీ టీమ్ అధికారికంగా పంచుకుంది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కేవలం మరో 6 రోజుల్లో మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా సెట్ లో రామ్ చరణ్, బుచ్చిబాబు దిగిన ఫోటోలను షేర్ చేశారు మేకర్స్.
పెద్ది టాకీ పార్ట్ పూర్తయినట్లు తెలుస్తోంది. ప్యాచ్ వర్క్ తో పాటు, స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తే మొత్తం షూటింగ్ పూర్తవుతుందట. స్పెషల్ సాంగ్ కోసం సంయుక్త మీనన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సాంగ్ షూటింగ్ రేపు(ఏప్రిల్ 22) స్టార్ట్ అవుతుందని వినికిడి.
ముందుగా ఈ సినిమాను ఏప్రిల్లోనే విడుదల చేయాలని భావించినప్పటికీ, అవుట్పుట్ విషయంలో రాజీ పడకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అందుకే ఈ చిత్రాన్ని జూన్ నెలలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
https://x.com/vriddhicinemas/status/2046553966218195327
![]() |
![]() |