Home  »  News  »  Om Shanthi Disco Shanthi: దెయ్యాలకే దడ పుట్టించే పిచ్చివాళ్లు.. బోయపాటి డైలాగ్‌తో రచ్చ రచ్చ!

Updated : Apr 20, 2026

ఆనందో బ్ర‌హ్మ‌, సేవ్ ది టైగ‌ర్స్ వంటి ఎంట‌ర్‌టైన‌ర్స్ సృష్టిక‌ర్త మ‌హి వి.రాఘ‌వ్, మరో క్రేజీ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన షో రన్నర్‌గా వ్యవహరిస్తున్న స‌రికొత్త కామెడీ హార‌ర్ చిత్రం ‘ఓం శాంతి డిస్కో శాంతి’ (Om Shanthi Disco Shanthi). ‘ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. 'అఖండ-2' మూవీ ప్రమోషన్స్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పిన ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అదే డైలాగ్ ను ఈ సినిమాకు ట్యాగ్ లైన్ గా పెట్టడం విశేషం.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సాధారణంగా హారర్ సినిమాల్లో దెయ్యాలు మనుషులను భయపెట్టడం చూస్తుంటాం. కానీ, ఈ సినిమాలో కథ అందుకు భిన్నంగా ఉండబోతోంది. దెయ్యాల‌కే భ‌యం పుట్టించే వాళ్లు ఎదురైతే? అస‌లు భ‌యం అంటే తెలియ‌ని పిచ్చివాళ్లు ఈ దెయ్యాల ముందుకు వ‌స్తే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దెయ్యాలు వ‌ర్సెస్ పిచ్చివాళ్లు మ‌ధ్య జ‌రిగే ఓ గంద‌ర‌గోళ‌మైన ఫుల్ ఫ‌న్ రైడర్ ‘ఓం శాంతి డిస్కో శాంతి’. 

‘సేవ్ ది టైగర్స్’ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌ తర్వాత మహి వి. రాఘవ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. గోగు ఆర్.ఆర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై శివ మేక, సాహితి చింతలపూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృష్ణ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా జ్ఞానశేఖర్ వి.ఎస్., ఎడిటర్ గా శ్రవణ్ క‌థిక‌నేని వ్యవహరిస్తున్నారు.

దెయ్యాలు పిచ్చివాళ్ల‌ని భ‌య‌పెట్ట‌గ‌ల‌వా?  లేక పిచ్చివాళ్లే తిర‌గ‌బ‌డి దెయ్యాల్ని భ‌య‌పెడ‌తారా?, జంప్ స్కేర్స్, ఫ‌న్నీ డైలాగ్స్‌, ఉహించ‌ని ట్విస్టులతో ఈ 'స్పూకీ ఫ‌న్ జ‌ర్నీ' తెర‌కెక్కుతోంది. ‘ఓం శాంతి డిస్కో శాంతి’ చిత్రాన్ని సెప్టెంబ‌ర్‌ 4న విడుద‌ల చేయ‌టానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ‘ఆనందో బ్రహ్మ’ తరహాలోనే ఈ ‘ఓం శాంతి డిస్కో శాంతి’ కూడా బాక్సాఫీస్ వద్ద నవ్వుల పువ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది.

 

https://x.com/Theteluguone/status/2046125815231107425






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.