![]() |
![]() |

సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram). ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది.
సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదలైంది. పెళ్లి వేడుకల్లో మార్మోగిపోయేలా ఈ సాంగ్ ని మేకర్స్ రూపొందించారు. (Thassadiya Song)
మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్.. ‘తస్సాదియ్యా’ పాటను ఒక ఫర్ఫెక్ట్ పార్టీ నంబర్‌గా మలిచారు. పాటలోని బీట్స్, రిథమ్ ఎంతో ఎనర్జిటిక్‌గా ఉన్నాయి. కేవలం సినిమా పాటగానే కాకుండా.. ఫ్యామిలీ ఫంక్షన్స్, పెళ్లిళ్లలో డ్యాన్స్ చేయడానికి ఈ సాంగ్ మంచి ఆప్షన్ అయ్యేలా ఉంది.
ఈ పాటకు రెహమాన్ సాహిత్యాన్ని అందించగా.. చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ ఆలపించారు. సమంతకు చిన్మయి వాయిస్ ఎంత బాగా సెట్ అవుతుందో మనందరికీ తెలిసిందే. ఈ పాటలో కూడా చిన్మయి తన గొంతుతో ఒక ప్రత్యేకమైన జోష్ నింపారు.
వీడియో సాంగ్‌లో సమంత ఎంతో హుషారుగా కనిపిస్తున్నారు. ఆమె కనిపించిన తీరు, ఎనర్జిటిక్ స్టెప్పులు, క్లాసీ కొరియోగ్రఫీ అన్నీ కూడా పాటను విజువల్ ట్రీట్‌గా మార్చేశాయి. విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా, ప్రతి ఫ్రేమ్ నిండుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, సెట్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి.
మొత్తానికి ‘తస్సాదియ్యా’ పాట ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రమోషన్లకు కొత్త ఊపునిచ్చింది. సమంత స్క్రీన్ ప్రెజెన్స్, సంతోష్ నారాయణన్ మ్యూజిక్, చిన్మయి గానం వెరసి ఈ పాట ఒక చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
‘ఓ బేబీ’ తరువాత నందినీ రెడ్డి, సమంత కలిసి చేస్తున్న చిత్రం కావడంతో సహజంగానే ఆడియెన్స్‌లో అంచనాలు ఏర్పడతాయి. ఇక రాజ్ నిడిమోరు స్టోరీ, స్క్రీన్ ప్లేని అందిస్తుండటంతో మరింతగా హైప్ ఏర్పడింది. ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే 15న విడుదల చేస్తున్నారు.
![]() |
![]() |