![]() |
![]() |

-ఎన్టీఆర్ కట్ అవుట్ కి ఉన్న రేంజ్ తెలిసిందే
-మరి ఆ రూమర్స్ సృష్టిస్తుంది ఎవరు
-మేకర్స్ ఏం చెప్తున్నారు
-ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ మీ కోసమే
అభిమానులు, మూవీ లవర్స్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు వింటేనే చాలు సినీ పరవశంతో పులకరించిపోతారు. అసలు స్క్రీన్ పై ఎన్టీఆర్(Ntr)పెర్ఫార్మ్ చూడాలంటే పెట్టి పుట్టాలనే సామెత కూడా చాలా బలంగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ కారణం వల్లనే బాక్స్ ఆఫీస్ సైతం సలాం కొట్టి నీ ఇష్టం ఎంత ఫిగర్ నమోదు చేస్తావో చేసుకో అని గత రికార్డ్స్ అన్నిటిని పక్కకి జరుపుతుంది. అంతటి ఛరిష్మాని పదహేరేళ్ళ వయసు నుంచే సంపాదించుకున్నది బహుశా వరల్డ్ సినీ హిస్టరీ లోనే ఎన్టీఆర్ నే అవ్వచ్చు. మరి అలాంటి ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన రూమర్ ఒకటి స్ప్రెడ్ అయితే ఊరుకుంటారా! ఇన్ఫర్మేషన్ ఇచ్చి పడేసారు.. డీటెయిల్స్ చూద్దాం.
ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ డ్రాగన్.. ఈ టైటిల్ ని అధికారకంగా కన్ఫార్మ్ చేయకపోయినా ప్రశాంత్ నీల్(Prashanth Neel), మైత్రి వాళ్ల మైండ్ సెట్ ని గమనిస్తే అదే నిజమని అనిపిస్తుంది. రెగ్యులర్ షూటింగ్ లోనే ఉంది. కానీ రూమర్స్ మేధావులు రంగంలోకి దిగి ఇటీవలే షూట్ కి సంబంధించి ఒక షెడ్యూల్ ని రద్దు చేసారని స్ప్రెడ్ చేస్తున్నారు. పైగా ఎన్టీఆర్ లుక్ ఇదేనంటూ మేకర్స్ సైతం నిజామా అని ఆశ్చర్యపోయేలా లుక్ ని డిజైన్ చేస్తున్నారు. మరి లేనివి ఉన్నట్టుగా క్రియేట్ చేస్తే కోట్ల రూపాయల ఖర్చుతో డ్రాగన్ ని తయారు చేస్తున్న మేకర్స్, ఫ్యాన్స్ ఎంతగానో బాధపడతారు కదా. ఒక్కోసారి నిజమైన లుక్, షూటింగ్ అప్ డేట్స్ ని మేకర్స్ ప్రకటించినా, ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితి ఉంటుంది. అందుకే ఇప్పుడు మేకర్స్ స్వయంగా డ్రాగన్ పై అధికారంగా స్పందిస్తు ఎన్టీఆర్ లుక్ గురించి గానీ, షెడ్యూల్ రద్దు గురించి గానీ ప్రచారంలో ఉన్న వదంతులలో ఏమాత్రం నిజం లేదు. జనరల్ గా వచ్చే గ్యాప్ తప్ప ప్రణాళిక ప్రకారమే మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. మేము ధృవీకరించని సమాచారాన్ని ఎవరు నమ్మద్దు, వ్యాప్తి కూడా చేయవద్దని అందరినీ కోరుతున్నాము.ఇక మా నుంచి అధికారిక అప్‌డేట్‌లు కంటిన్యూ గా వస్తాయని తెలిపింది.
Also Read: నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేశా
దీంతో రూమర్స్ మేధావులకి మైండ్ బ్లాంక్ అయ్యి దిమ్మ తిరిగినంత పని అయ్యింది. ఫ్యాన్స్ మాత్రం మేకర్స్ కి కంగ్రాట్స్ చెప్తు ఇక నుంచైనా రూమర్స్ కి అలా సృష్టించే అవకాశం ఇవ్వకుండా మీరే ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇవ్వాలని కోరుతున్నారు. డ్రాగన్ ఎన్టీఆర్ ఎంటైర్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంటుంది. ప్రశాంత్ నీల్ కూడా తన గత చిత్రాలు కేజీఎఫ్ సిరీస్, సలార్ ని మించి హిట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ఎన్టీఆర్ కి జోడిగా రుక్మిణి వసంత్ జత కడుతుంది.
There is absolutely no truth to the rumours circulating about the look or any schedule cancellation. The film is progressing as planned, with only a routine preparation gap. We request everyone not to believe or spread unverified information. Official updates will always come from us.
#NTRNeel
![]() |
![]() |