Home  »  News  »  Anushka Sharma: కింగ్ కోహ్లీ వైఫ్ అనుష్క శర్మ టాలీవుడ్ ఎంట్రీ.. షాక్ ఇచ్చిన పీఆర్ టీం!

Updated : Mar 25, 2026

 

 


-అనుష్క శర్మ టాలీవుడ్ ఎంట్రీ ఖాయమైందా!
-ఇంతకీ ఆ సినిమా ఏంటి!
-అల్లు అర్జున్, అట్లీ మూవీ నేనా!

అనుష్క శర్మ(Anushka Sharma)..ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి దొరికిన అందమైన నటీమణుల్లో ఒకరు. సహజత్వం ఒట్టిపడటం అనుష్క శర్మ పెర్ఫార్మ్ స్టైల్. 2008 లో బాలీవుడ్ బాద్షా 'షారుక్'(Shahrukh Khan)తో 'రబ్ డే బనాదే జోడి'తో ఎంట్రీ ఇచ్చి ఎన్నో హిట్ చిత్రాల్లో చేసి తనకంటు ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంది. కింగ్ కోహ్లీ(Kohli)తో  వివాహం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా  మెరవకపోయినా నిర్మాతగా సినిమాలు చేస్తూ తన ఫ్యాషన్ మాత్రం తగ్గలేదని నిరూపిస్తుంది. రీసెంట్ గా తొలిసారి బాలీవుడ్ లో కాకుండా మన టాలీవుడ్ మీడియా సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun),అట్లీ(Atlee)కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ఎంత ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ నో తెలిసిందే. ఇండియన్ సినిమా ప్రౌడ్ గా ఫీలయ్యేలా కాంప్రమైజ్ అనే వర్డ్ కి చోటు లేదన్నట్టుగా నిర్మిస్తున్నారు. అలాంటి ఈ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ లో అనుష్క శర్మ కూడా జాయిన్ అయ్యిందనే వార్తలు నిన్నటుంచి వినిపిస్తున్నాయి. అధికార ప్రకటన రాకపోయినా తన కో యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే తెలుగు చిత్రాల బాట పడుతుండటంతో అల్లు అర్జున్ తో అనుష్క శర్మ చెయ్యడం ఖాయమని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అనుష్క శర్మ చెయ్యడం లేదని ఆమె పీఆర్ టీం ద్రువీకరించినట్టుగా తాజాగా బాలీవుడ్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుంది. దీంతో అనుష్క శర్మ ని తెలుగు సెల్యులాయిడ్ పై చూడాలనే అభిమానుల ఆశ ఆవిరయినట్టయ్యింది.


Also read: Ram Charan: చరణ్ కి గాయాలు! 

అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ లో నలుగురు హీరోయిన్ లకి చోటు ఉందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీపికా పడుకునే ఒక హీరోయిన్ కాగా మిగతా హీరోయిన్స్ విషయంలో చాలా రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ రూమర్స్ ని నమ్మే పరిస్థితిలో అయితే అల్లు ఆర్మీ, తెలుగు సినిమా లవర్స్ లేరు. ఎందుకంటే సోషల్ మీడియాలో ట్వంటీ ఫోర్ అవర్స్  లీనమయ్యే  హక్కు వాళ్లకి కూడా ఉంది కాబట్టి. 

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.