![]() |
![]() |

-ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు
-అసభ్యంగా ప్రవర్తించింది అతనేనా!
-అసలు ఆమె ఏం చెప్తుంది
ఎప్పుడొచ్చాం కాదన్నాయ్..బులెట్ దిగిందా లేదా అనే రీతిలో సొంత తెలుగుంటిలో 'సంక్రాంతికి వస్తున్నాం' తో బ్లాక్ బస్టర్ ని అందుకుంది ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh)భాగ్యలక్ష్మి క్యారక్టర్ కి పర్ఫెక్ట్ గా సూటవ్వడమే కాకుండా గోదారోళ్ల మాడ్యులేషన్ తో ఒక రేంజ్ పెర్ఫార్మ్ చేసింది. వెంకటేష్(venkatesh)లాంటి బడా స్టార్ పక్కన ఎలాంటి బెరుకు లేకుండా నటించే సత్తా తనకి ఉందని, అనిల్ రావిపూడి(Anil Ravipudi)ఏరి కోరి ఐశ్వర్య ని ఎంపిక చేసారంటే ఆమె నటనకి ఉన్న శక్తిని అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా ఐశ్వర్య ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొంది. అందులో ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లోనే వైరల్ గా నిలుస్తున్నాయి. తను ఏం చెప్పిందో చూద్దాం.
నా కెరీర్ ప్రారంభంలో ఓ సినిమా ఆడిషన్స్‌కి వెళ్లాను. అక్కడ ఓ డైరెక్టర్ నాతో మాట్లాడుతు సెక్సీ డ్రెస్ వేసుకుని కనిపించు, నిన్ను ఆ బట్టల్లో చూడాలని ఉంది. చూపించు’ అంటూ అసభ్యంగా మాట్లాడాడు. దాంతో ఎంతో ఆవేదన చెందాను. అతడు కేవలం నా శరీరాన్ని చూడాలన్న కోరికతోనే అలా మాట్లాడాడు. ఆ టైమ్‌లో నాకు చాలా కోపం వచ్చింది. నా కంటే ముందు ఆ విధంగా ఎంత మందిని అడిగి ఉంటాడోనని ఆలోచించుకుని చాలా బాధపడ్డాను. ఆనాటి సంఘటనని ఎప్పటికీ మరిచిపోలేను అంటూ బాధపడింది.
Also read: సుస్మిత కొణిదెల vs తేజస్విని నందమూరి
ఐశ్వర్య 2010 లో తమిళంలో తెరకెక్కిన 'నీతనా అవన్' తో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆ తర్వాత తమిళ, మలయాళంలో కలుపుకొని హీరోయిన్ గా, ప్రధాన క్యారెక్టర్స్ లో సుమారు ముప్పై మూడు చిత్రాల వరకు చేసింది. 2019 లో కౌసల్య కృష్ణమూర్తి ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేయగా, సంక్రాంతికి వస్తున్నాం తనకి ఆరవ సినిమా. మరి ఐశ్వర్య తో అసభ్యంగా ప్రవర్తించిన డైరెక్టర్ ఏ లాంగ్వేజ్ కి చెందిన వ్యక్తి అయ్యి ఉంటాడని నెటిజెన్స్ తమ ఇన్విస్టిగేషన్ ని స్టార్ట్ చేశారు. ప్రస్థుతానికి అయితే తనకి తెలుగులో ఆఫర్స్ లేవు. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ అయినా అవకాశాలు ఎందుకు రావడం లేదో అని ఇదే ఇంటర్వ్యూలో తన బాధని వ్యక్తం చేసింది. ఐశ్వర్య ఒకప్పటి తెలుగు నటుడు రాజేష్ కూతురు అనే విషయం తెలిసిందే.
![]() |
![]() |