![]() |
![]() |
నవీన్ పోలిశెట్టి లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఒకరాజు’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్.. సినిమాపై తన ఒపీనియన్‌ను తెలియజేస్తూ నవీన్ పొలిశెట్టిని సన్మానించారు. ఈ సినిమాలో కామెడీ మాత్రమే కాదు, కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయని ప్రశంసించారు.
నవీన్ పోలిశెట్టి మార్క్ కామెడీతో ప్రేక్షకుల్ని బాగా అలరించాడని త్రివిక్రమ్ కితాబిచ్చారు. అతనికి శాలువా కప్పి సన్మానించారు. కేక్ కట్ చేసి, చిత్ర యూనిట్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ఎస్.రాధాకృష్ణ, నాగవంశీ, హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.
సంక్రాంతి పండగ సందర్భంగా ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించే లక్ష్యంగా రూపొందిన ‘అనగనగా ఒకరాజు’ చిత్రం మొదటి షో నుంచే అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారని నవీన్ పొలిశెట్టి అన్నారు. చక్కని పండగ సినిమా అందించాలని మేం చేసిన ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని నవీన్ అన్నారు.
![]() |
![]() |