![]() |
.webp)
సినిమా పేరు: నారీనారీనడుమ మురారి
నటీనటులు: శర్వానంద్, సాక్షి వైద్య, సంయుక్త మీనన్, శ్రీ విష్ణు, నరేష్, సంపత్,సునీల్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగర్, సత్య తదితరులు
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వి ఎస్
ఎడిటర్: రవి శంకర్
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
నిర్మాత: అనిల్ సుంకర, రామ బ్రహ్మం
బ్యానర్:ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్
మాటలు: నందు, భాను
రచన, దర్శకత్వం: రామ్ అబ్బరాజు
రిలీజ్ డేట్ : జనవరి 14 ,2025
ఎక్స్ క్యూజ్ మీ.. సంక్రాంతి కుర్చీ పై నేను కూడా కన్నేసానంటు శర్వానంద్(Sharwanand)ఈ రోజు 5 .59 నిమిషాలకి నారీ నారీ నడుమ మురారి తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. ప్రచార చిత్రాలతో మంచి హైప్ ని కూడా క్రియేట్ చేసుకుంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
గౌతమ్(శర్వానంద్) ఆర్కిటెక్ జాబ్ చేస్తుంటాడు. నిత్య(సాక్షి వైద్య) కూడా ఆర్కిటెక్ జాబ్ చేస్తుంటుంది. ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకుంటారు. నిత్య తండ్రి రామ లింగయ్య(సంపత్) ఫేమస్ లాయర్. తమ ప్రేమ విషయం రామలింగయ్య కి చెప్తారు. మీ ఇద్దరిది ప్రేమ కాదని, ప్రేమ అయితే మీ ఇద్దరి లైఫ్ లో కొన్ని జరిగేవి అని రామలింగయ్య చెప్తాడు. కానీ తమది ప్రేమనే అని గౌతమ్, నిత్య గట్టిగా చెప్తారు. దీంతో పెళ్ళికి ఒప్పుకుంటాడు. కానీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనే కండిషన్ పెడతాడు. కానీ గౌతమ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలంటే గౌతమ్ ఆఫీస్ బాస్ దియా( సంయుక్త మీనన్) సహాయం కావాల్సి ఉంటుంది. గౌతమ్ పెళ్ళికి దియాకి సంబంధం ఏంటి? దియా నే ఎందుకు సహాయం చెయ్యాలి? దియా సాయం చేసిందా? గౌతమ్, నిత్య లది ప్రేమ కాదని రామలింగయ్య ఎందుకు అన్నాడు! రిజిస్టర్ మ్యారేజ్ కి ఒప్పుకున్న రామలింగయ్య టార్గెట్ ఏంటి! చివరకి గౌతమ్, నిత్య ఒక్కటి అయ్యారా! అసలు నారీ నారీ నడుమ మురారి టార్గెట్ ఏంటి అనేదే చిత్ర కథ.
ఎనాలసిస్
సినిమా చూస్తున్నంత సేపు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా హాయిగా నవ్వుకుంటూనే ఉంటాం. ఆర్టిస్టుల దగ్గరనుంచి, టెక్నీషియన్స్ దాకా అందరు నిజమైన సంక్రాంతిని మన ముందు ఉంచారు. కథ,కథనాలు ప్రధాన బలంగా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే శర్వానంద్ ఎంట్రన్స్ రొటీన్ గా అనిపించినా ఆ తర్వాత పర్పస్ తెలిసి మనకి తెలియకుండానే నవ్వుల్లోకి వెళ్ళిపోతాం. ఆ పాయింట్ సినిమా చివరి దాకా విపరీతమైన ఎంటర్ టైన్ మెంట్ ని జనరేట్ చెయ్యడంతో పాటు సినిమాకి కొత్త లుక్ ని తీసుకొచ్చింది. నిత్య, గౌతమ్ లవ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా కొత్తగా ఉండి,కేరళ అందాలని కూడా చూపించింది.
వెంటనే దియా ఫ్లాష్ బ్యాక్ వచ్చి సినిమా లుక్ ని మార్చేసి సినిమా హిట్ అనేలా చేసింది. ఆ సంధర్భంగా దియా తండ్రితో వచ్చిన సీన్స్ బాగున్నాయి. కార్తీక్ క్యారక్టర్ లో చేసిన నరేష్ ఎపిసోడ్ అయితే సూపర్. సత్య సీన్స్ కూడా బాగా పేలాయి. ఇంటర్ వెల్ ట్విస్ట్ సూపర్. ఇక సెకండ్ హాఫ్ లో ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ చివరకి వరకు నడిచింది. రిజిస్టర్ సత్యమూర్తి వచ్చిన సీన్స్ ఒక రేంజ్ లో పేలాయి. వెన్నెల కిషోర్ క్యారక్టర్ ప్లేస్ మెంట్, ఆ క్యారక్టర్ యాటిట్యూడ్, సదరు క్యారక్టర్ ని కథకి అన్వయించుకున్న తీరుతో వచ్చిన సీన్స్ అన్ని హైలెట్.
ముఖ్యంగా గౌతమ్, దియా, నిత్య మధ్య వచ్చిన సీన్స్, దియా తండ్రి ఫ్లాష్ బ్యాక్ చెప్పిన సీన్స్ అయితే ఎక్స్ లెంట్. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉండటంతో పాటు కథ కి ఉన్న పర్పస్ ని తెలియచేశాయి.
నటి నటులు సాంకేతిక నిపుణుల పని తీరు
రెండు కోణాలు దాగి ఉన్న గౌతమ్ క్యారక్టర్ లో శర్వానంద్ పెర్ ఫార్మ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పుడే అయిపోయిదనుకోకు, ఇప్పుడే మొదలయింది, తెలుగు సినిమాపై నా ప్రభావం చాలా బలంగా ఉండబోతుందనేలా విజృంభించి చేసాడు. లుక్, స్టైల్ పరంగా కూడా సరికొత్త శర్వానంద్ ని కళ్ళ ముందు ఉంచాడు. హీరోయిన్స్ గా చేసిన సాక్షి వైద్య, సంయుక్త మీనన్ కూడా మెస్మరైజ్ చేసే స్థాయిలో ది బెస్ట్ పెర్ ఫార్మ్ ఇచ్చారు. శ్రీవిష్ణు కనిపించిన కాసేపు అయినా నవ్వులు పూయించాడు. ఇక నరేష్, సంపత్, సునీల్, వెన్నెల కిషోర్, సత్య అయితే తమ ఫ్యాన్ బేస్ ని వెయ్యి రేట్లు పెరిగేలా చేసారు. ఈ సినిమాతో వాళ్ళకి వీరాభిమానులు ఏర్పడతారేమో. అంతలా తమ నాచురల్ పెర్ ఫార్మ్ తో కుమ్మి పడేసారు. మిగతా ఆర్టిస్టులు కూడా తమ క్యారెక్టర్స్ కి నూటికి నూరుపాళ్లు న్యాయం చేసారు. ఇక నందు, భాను నుంచి డైలాగ్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. నవ్వని వాడు పాపాత్ముడు అనేలా తమ కాలంతో విజృంభించారు. అక్షరానికి ఉన్న పవర్ ని కూడా చాటి చెప్పినట్లయింది. దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా రామ్ అబ్బరాజు నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు. క్యారెక్టర్స్ ని ఉపయోగించుకున్న తీరుకి హాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. ఫొటోగ్రఫీ, నిర్మాణ విలువలు అతిపెద్ద బలంగా నిలిచాయి. సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథకి,క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి.
ఫైనల్ గా చెప్పాలంటే మనలో ఉన్న ఆల్ టెన్షన్స్ ని తగ్గించే నవ్వుల దివ్య ఔషధం నారీ నారీ నడుమ మురారి. పర్ ఫెక్ట్ సంక్రాంతి సినిమా. కుటుంబ సమేతంగా అందరు ఎంజాయ్ చేసే మూవీ. బ్లాక్ బస్టర్ అనేది చిన్న వర్డ్.
రేటింగ్ 3 . 25 / 5 అరుణాచలం
![]() |