![]() |
![]() |
.webp)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తన 22వ సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ని.. 2027 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే దీని తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది.
అట్లీ తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో పని చేస్తాడని కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. ఇటీవల కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు ప్రముఖంగా వినిపించింది. అందుకు తగ్గట్టుగానే అల్లు అర్జున్-లోకేష్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.
అల్లు అర్జున్ 23వ సినిమాగా లోకేష్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి అనిరుధ్ సంగీత దర్శకుడు. అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ కి తగ్గట్టుగా ఒక విభిన్న కథను లోకేష్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. (AA 23)
Also Read: అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ
కాగా, కుమారస్వామి కథతో 'గాడ్ ఆఫ్ వార్' అనే భారీ మైథలాజికల్ ఫిల్మ్ ని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా ఎన్టీఆర్ నటిస్తాడా లేక అల్లు అర్జున్ నటిస్తాడా? అనే చర్చ కొంతకాలంగా విపరీతంగా నడుస్తోంది. ఇప్పుడు అల్లు అర్జున్-లోకేష్ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వచ్చిన నేపథ్యంలో.. 'గాడ్ ఆఫ్ వార్'లో ఎన్టీఆర్ నటిస్తుండటం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది.
https://x.com/alluarjun/status/2011401847282794838?s=20
![]() |
![]() |