![]() |
![]() |

-రికార్డు కలెక్షన్స్ వేటలో మన శంకర వర ప్రసాద్ గారు
-ప్రస్థుతానికి ఎంత, ఎండింగ్ కి ఎంత
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.
ఈ నెల 11 న థియేటర్స్ లో అడుగుపెట్టిన మన శంకర వరప్రసాద్ గారు రెండు రోజులకి వరల్డ్ వైడ్ గా 120 కోట్ల గ్రాస్ ని సాధించింది. ఈ మేరకు మేకర్స్ అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు. దీంతో రెండవ రోజుకే చిరంజీవి కెరీర్ లోనే120 కోట్లు గ్రాస్ ని అందుకున్న తొలి మూవీగా కూడా మన శంకర వర ప్రసాద్ గారు నిలిచినట్లయింది. కలెక్షన్స్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అండ్ విక్టరీ అభిమానులు స్పందిస్తూ ఆ కలెక్షన్స్ జస్ట్ శాంపుల్. టోటల్ రన్ లో తెలుగు సిల్వర్ స్క్రీన్ పై చిరంజీవి, వెంకటేష్ ల మానియా సరికొత్త రికార్డు ఫిగర్ ని సృష్టించబోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also read: అనసూయ సంచలన నిర్ణయం.. నెక్స్ట్ ఏం జరగబోతుంది!
రీసెంట్ గా చిరంజీవి తన నివాసంలో కేక్ కట్ చేసి మన శంకర వరప్రసాద్ సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో చిరంజీవి(Chiranjeevi),వెంకటేష్(venkatesh),దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi)రామ్ చరణ్(Ram Charan)తో పాటు సుస్మిత, సాహు గారపాటి, ప్రధాన చిత్ర బృందం పాల్గొంది.

![]() |
![]() |