![]() |
![]() |

-మన శంకర వర ప్రసాద్ గారు టాక్ ఎలా ఉంది
-భర్త మహాశయులుకి విజ్ఞప్తి బ్యాక్ గ్రౌండ్ ఏంటి
-అనగనగ ఒక రాజు పరిస్థితి
-నారీనారీనడుమమురారి రిజల్ట్ ఎలా ఉండబోతుంది
మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)కి రివ్యూస్ తో పాటు అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఖాతాలోకి మన శంకర వర ప్రసాద్ గారు ద్వారా మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరినట్టుగా సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో రేపట్నుంచి వరుసగా సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాల ఫలితాలపై ఆసక్తి నెలకొని ఉంది. మరి ఆ మూడు సినిమాల బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాం.
మాస్ మహారాజా రవితేజ తన మాస్ ఇమేజ్ ని టచ్ చేస్తూనే రేపు 'భర్త మహాశయులుకి విజ్ఞప్తి(Bhartha Mahasayulaki Wignyapthi)ద్వారా థియేటర్స్ లో అడుగుపెడుతున్నాడు. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా నేను శైలజ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన కిషోర్ తిరుమల(Kishore Tirumala)దర్శకుడు. నేను శైలజ తర్వాత కిషోర్ దర్శక జర్నీని చూసుకుంటే 'ఉన్నది ఒక్కటే జిందగీ, చిత్రాలహరి, రెడ్, ఆడవాళ్లు మీకుజోహార్లు వంటి చిత్రాలు వచ్చాయి. వాటిల్లో చిత్రలహరి మాత్రమే ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది. కాకపోతే సినీ ఫీల్డ్ లో గత చిత్రం తాలూకు యొక్క హిట్ ప్లాప్ తో సంబంధం ఉండదు. కంటెంట్ బాగుంటే హిట్ టాక్ ని కట్టబెడతారు. మరి భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి వచ్చిన ప్రచార చిత్రాలైతే బాగున్నాయి. రవితేజ సరసన ఆషికా రంగనాధ్, డింప్లి హయతి జత కట్టగా దసరా మూవీ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి నిర్మించాడు.
ఇక 14 న కామెడీ డ్రామాగా తెరకెక్కిన 'అనగనగ ఒక రాజు' తో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి థియేటర్స్ లో అడుగుపెడుతున్నారు. ప్రచార చిత్రాలు బాగుండటం, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే పట్టుదలతో నవీన్ పోలిశెట్టి వస్తున్నాడు. మారి(Maari)అనే నూతన దర్శకుడు బాగానే తెరకెక్కించాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. సితార ఎంటర్ టైన్ మెంట్ పై నాగవంశీ నిర్మించడం అనగనగా ఒక రాజు స్పెషాలిటీ. మరి 14 సాయంత్రం ఆట నుంచే శర్వానంద్ కూడా నారీనారీనడుమమురారి ద్వారా సంక్రాంతి బరిలో దిగుతున్నాడు.
also read: మన శంకర వర ప్రసాద్ గారు లో హైలెట్స్ ఇవే
సామజవరగమన వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన రామ్ అబ్బరాజు(Ram Abbaraju)దర్శకుడు కావడంతో పాటు ప్రచార చిత్రాలు బాగున్నాయి. ఒక కొత్త శర్వానంద్ కూడా ఈ సారి సిల్వర్ స్క్రీన్ పై ప్రత్యక్షం కాబోతున్నాడు. శర్వానంద్ సరసన వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సంయుక్త మీనన్ జత కట్టగా మరో భామ సాక్షి వైద్య కూడా ఆడిపాడింది. సామజవరగమన ని నిర్మించిన అనిల్ సుంకర నే నిర్మించడం విశేషం. టోటల్ గా చెప్పాలంటే మూడుచిత్రాలు సంక్రాంతి కాంతులని తెలుగు ప్రేక్షకులకి మరింతగా ఇవ్వాలనే ప్రధాన ద్యేయంతో వస్తున్నాయి.
మరి అదే అనుభూతిని ఇవ్వడానికి వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి వెలుగుల్ని పెంచడంలో సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగ ఒక రాజు, నారీనారీనడుమమురారి చిత్రాల ఫలితాలపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.
![]() |
![]() |