![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన 'జననాయగన్' సినిమా నేడు(జనవరి 9) విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో తాజాగా మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. (Jana Nayagan)
పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ దళపతి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ 'జననాయగన్'లో కొన్ని సీన్స్, డైలాగ్స్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని అభ్యంతర సీన్స్ ని తొలగించడంతో పాటు, కొన్ని డైలాగ్స్ ని మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డు సూచించిందని సమాచారం. సెన్సార్ సూచనతో మార్పులు చేసిన మేకర్స్.. సినిమాని మళ్ళీ సెన్సార్ కి పంపారు. మొదట U/A సర్టిఫికెట్ ఇవ్వడానికి ఓకే చెప్పిన.. ఆ తర్వాత మళ్లీ రివ్యూ కమిటీకి పంపింది. ఇదే విషయాన్ని 'జననాయగన్' నిర్మాతలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
మద్రాస్ హైకోర్టులో జననాయగన్ సినిమాకు ఊరట లభించింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని CBFCని న్యాయస్థానం ఆదేశించింది. సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మళ్లీ రివ్యూ కమిటీకి పంపాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించిన హైకోర్టు సింగిల్ జడ్జి.. ముందుగా ఇస్తామన్న U/A సర్టిఫికెట్ తక్షణమే ఇవ్వాలని ఆదేశించారు.
అయితే జననాయగన్ కు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలనే సింగిల్ జడ్జి తీర్పును సెన్సార్ బోర్డు సవాలు చేసింది. దీనిపై ఈ రోజు లేదా సోమవారం విచారణ జరగనుంది. మరి జననాయగన్ కి పూర్తిగా లైన్ క్లియర్ అవుతుందేమో చూడాలి. జనవరి 14న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
![]() |
![]() |