![]() |
![]() |

- రాజా సాబ్ మూవీ ఎలా ఉంది?
- సినిమాలో హైలైట్స్ ఏంటి?
- ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీనా కాదా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) మొదటిసారి హారర్ కామెడీ జానర్ లో చేసిన సినిమా 'ది రాజా సాబ్'(The Raja Saab). మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ, జనవరి 8 రాత్రి ప్రీమియర్ షోలతో థియేటర్లలో అడుగుపెట్టింది. అయితే ఈ ఫిల్మ్ డివైడ్ టాక్ నే సొంతం చేసుకుంది.
'ది రాజా సాబ్' సినిమా టాక్ ఎలా ఉన్నా.. ఇందులో కొన్ని హైలైట్స్ ఉన్నాయి. అందులో మెయిన్ హైలైట్ ప్రభాస్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభాస్ తన స్క్రీన్ ప్రజెన్స్, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో సినిమాను తన భుజాలపై మోశాడు. వీక్ రైటింగ్ తో ఏకంగా మూడు గంటల నిడివితో ఈ ఫిల్మ్ తెరకెక్కినప్పటికీ.. ప్రేక్షకులు అంతసేపు కూర్చోగలుగుతున్నారంటే అందుకు కారణం ప్రభాస్. ఈ సినిమాలో మొత్తం పది హైలైట్స్ ఉన్నాయి అనుకుంటే.. అందులో ఒకటి నుంచి ఐదు వరకు ప్రభాసే ఉంటాడు.
Also Read: ది రాజా సాబ్ మూవీ రివ్యూ
ప్రభాస్ తర్వాత 'రాజా సాబ్' మూవీ హైలైట్ ప్రొడక్షన్ వాల్యూస్ అని చెప్పవచ్చు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో ఉన్నాయి. అలాగే వీఎఫ్ఎక్స్ కూడా ఆకట్టుకుంది. ఇక తమన్ మ్యూజిక్ ని కూడా హైలైట్స్ లో ఒకటిగా చెప్పవచ్చు. సాంగ్స్ తో పెద్దగా మ్యాజిక్ చేయనప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చాలా సీన్స్ ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ ని కూడా మెయిన్ హైలైట్ గా పరిగణించవచ్చు. మారుతి తీసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ, ఎగ్జిక్యూషన్ లో తడబడ్డాడు. ఇంటర్వెల్, క్లైమాక్స్ లో మాత్రమే రచయితగా, దర్శకుడిగా ప్రభావాన్ని చూపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ తో బాగా మెప్పించాడు.
ది రాజా సాబ్ హైలైట్స్:
1 to 5. ప్రభాస్
6. ప్రొడక్షన్ వాల్యూస్
7. బ్యాక్ గ్రౌండ్ స్కోర్
8. వీఎఫ్ఎక్స్
9. ఇంటర్వెల్
10. క్లైమాక్స్
![]() |
![]() |