![]() |
![]() |
- కొత్త వివాదంలో శివాజీ
- శివాజీ కామెంట్స్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలు
- వివాదానికి దారి తీసిన అంశాలేమిటి?
- నోటీసులతో పరిమితం కాదంటున్న మహిళా కమిషన్
ఇటీవలికాలంలో పలు వేదికలపై సినీ ప్రముఖులు ఏదో ఒక అంశంపై వ్యాఖ్యలు చేయడం, అవి పెద్ద దుమారానికి దారి తీయడం చూస్తున్నాం. ఈ క్రమంలోనే హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన దండోరా సినిమా వేడుకలో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చట్టపరమైన చిక్కులకు దారితీశాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రసంగించారన్న ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. దీనిని సుమోటో కేసుగా స్వీకరించింది. ప్రాథమిక విచారణ అనంతరం, ఆయన ప్రసంగంలో మహిళల పట్ల అవమానకర ధోరణి ఉందని కమిషన్ నిర్ధారించింది.
కేవలం నోటీసులతోనే సరిపెట్టకుండా, ఈ వ్యవహారాన్ని లోతుగా విచారించాలని కమిషన్ నిర్ణయించింది. అంతేకాదు, ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే నటుడు శివాజీకి అధికారికంగా నోటీసులు జారీ అయ్యాయి. మహిళా కమిషన్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం డిసెంబర్ 27వ తేదీన ఉదయం 11:00 గంటలకు హైదరాబాద్‌లోని బుద్ధ భవన్‌లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయంలో శివాజీ స్వయంగా కమిషన్ ఎదుట హాజరై తన వివరణ ఇచ్చుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ అంశం మీద ఇప్పటికే శివాజీ క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. అయితే మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఈనెల 27న శివాజీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
![]() |
![]() |