![]() |
![]() |

ఈ జనరేషన్ యంగ్ స్టార్స్ లో సంక్రాంతి హీరోగా శర్వానంద్(Sharwanand)కి పేరుంది. బిగ్ స్టార్స్ సినిమాలతో పోటీపడి మరీ.. 2016 సంక్రాంతికి 'ఎక్స్‌ప్రెస్ రాజా', 2017 సంక్రాంతికి 'శతమానం భవతి'తో హిట్స్ కొట్టాడు. ఇప్పుడు 2026 సంక్రాంతికి కూడా స్టార్స్ తో పోటీకి సై అంటూ 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో థియేటర్లలో అడుగుపెడుతున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. (Nari Nari Naduma Murari)
'నారీ నారీ నడుమ మురారి' అనే టైటిల్ చూస్తేనే.. ఇది ఇద్దరు హీరోయిన్ల మధ్యలో నలిగిపోయే హీరో కథ అని అర్థమవుతోంది. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ టీజర్ ఉంది. ప్రేయసి, మాజీ ప్రేయసి మధ్య నలిగిపోయే వ్యక్తిగా శర్వానంద్ కనిపిస్తున్నాడు. (Nari Nari Naduma Murari Teaser)
"పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి వెళ్తున్నాను" అంటూ సత్యకి శర్వానంద్ చెబుతున్న డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. "నా పేరు లవకుశ.. లవ్ కోసం ఎంత దూరమైనా వెళ్తా" అనే డైలాగ్ తో సత్య క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చెప్పేశారు. ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తున్న శర్వానంద్, సాక్షి వైద్య ప్రేమించి పెళ్లికి రెడీ అవుతారు. అయితే అదే ఆఫీస్ కి టీమ్ లీడ్ గా శర్వానంద్ ఎక్స్ గర్ల్ ఫెండ్ అయిన సంయుక్త మీనన్ ఎంట్రీ ఇస్తుంది. దీంతో శర్వానంద్ లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది అనే కోణంలో టీజర్ ని రూపొందించారు. టీజర్ చూస్తుంటే.. సినిమా సరదాగా, యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుందని అర్థమవుతోంది.
Also Read: దివ్య దృష్టి మూవీ రివ్యూ
సరైన ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ పడితే.. శర్వానంద్ మ్యాజిక్ చేసేస్తాడు. పైగా 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకుడు కావడంతో కామెడీ ఏ స్థాయిలో ఉంటుందో ఓ అంచనాకు రావొచ్చు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 సాయంత్రం 5:49 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. 'సామజవరగమన' స్థాయిలో కామెడీ వర్కౌట్ అయితే.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసే ఛాన్స్ ఉంది.
![]() |
![]() |