![]() |
![]() |

-అసలు ఏం చెప్పాడు?
-ఇప్పుడు ఏమంటున్నాడు
-అసలు మ్యాటర్ ఏంటి!
తెలుగు చిత్ర పరిశ్రమకి, శివాజీ(Sivaji)కి మధ్య ఉన్న అనుబంధం యొక్క వయసు రెండున్నర దశాబ్దాల పైనే. 1997 లో వచ్చిన చిరంజీవి హిట్ మూవీ 'మాస్టర్' తో ఎంట్రీ ఇచ్చి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో చేస్తూ తన కంటూ ఒక 'ఎరా' ని సృష్టించుకున్నాడు. కొంత కాలం తర్వాత కోర్టు మూవీతో మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై తన హవా చాటడం స్టార్ట్ చేసిన శివాజీ ఈ నెల 25 న క్రిస్మస్ కానుకగా 'దండోరా' మూవీతో థియేటర్స్ లో అడుగుపెట్టనున్నాడు. ప్రచార చిత్రాలు బాగుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
కొన్ని రోజుల క్రితం శివాజీ మాట్లాడుతు టికెట్ ధరలని పెంచడం వల్లే తొంబై తొమ్మిది శాతం మంది ప్రేక్షకులు థియేటర్లకి దూరమవుతున్నారనే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సదరు వ్యాఖ్యలు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. తాను చేసిన ఆ వ్యాఖ్యలపై 'దండోర' (Dandora)ప్రచార కార్యక్రమాల్లో మరోసారి శివాజీ మాట్లాడుతు ప్రస్తుతం ఉన్న సందర్భాన్ని అందరికి గుర్తు చేయాలనే మాట్లాడతాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు మాట్లాడను. ఏ విషయంలోనైనా నిజం మాట్లాడటం నా అలవాటు, నేను చేసిన కామెంట్స్ ని తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.
Also read: ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగు హీరోయిన్.. బాక్స్ ఆఫీస్ షేక్
ఇదే విధంగా ఐబొమ్మ రవి గురించి మాట్లాడాను. అతడికి ఉన్న తెలివితేటలని మంచి పనులకి ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పాను. కానీ అతను చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు కాబట్టి తప్పు చేసినట్లే అని కూడా చెప్పా. ఆ కామెంట్స్ విషయంలో నేను పశ్చాత్తాపడడం లేదు అని మరోసారి తన వ్యాఖ్యలపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు.
![]() |
![]() |